Dhanush: శాక్రిఫైస్ స్టార్ ధనుష్.. సీనియర్ కోసం మరోసారి వాయిదా
- July 4, 2026 / 04:09 PM ISTByFilmy Focus Desk
కోలీవుడ్‌లో సినిమా తర్వాత సినిమా.. సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్లిపోయే హీరో ధనుష్. సినిమా ఫలితంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఆయన లైనప్ సాగిపోతూ ఉంటుంది. అయితే, రీసెంట్‌గా ఆయనను కోలీవుడ్‌లో శాక్రిఫైస్ స్టార్ అని కూడా పిలుస్తున్నారు. అది కూడా సీనియర్ స్టార్ హీరోల కోసం త్యాగం చేసే స్టార్ అని కూడా అంటున్నారు. ఇటీవల కాలంలో రెండుసార్లు త్యాగం చేసిన ధనుష్.. ఇప్పుడు మూడో సారి చేయబోతున్నాడు అనేది టాక్.
Dhanush
మీరు విన్నది నిజమే.. ధనుష్ కొత్త సినిమా ‘ఓం’ విడుదల వాయిదా పడుతుంది అని సమాచారం. ఈ మేరకు సినిమా టీమ్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు కానీ.. సినిమా రావడం మాత్రం కష్టమే అని చెబుతున్నారు. ఎందుకంటే ఆ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటున్న సమయానికి మరో పెద్ద హీరో సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ మేరకు ఇటీవల అనౌన్స్‌మెంట్ కూడా చేసేశారు. ఆ సినిమానే ‘జైలర్ 2’.

రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘జైలర్ 2’. మూడేళ్ల క్రితం వచ్చిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాను అక్టోబరు 15న దసరా కానుకగా రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పటికే అక్టోబరు 16న ‘ఓం’ తీసుకొస్తామని ధనుష్ చెప్పేశాడు. కానీ ఆయన ట్రాక్ రికార్డు తెలిశాక ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో వచ్చే అవకాశమే లేదు అని చెప్పాలి.
ఎందుకంటే కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా కోసం ఒకసారి ‘రాయన్’ సినిమా వాయిదా వేసుకున్నాడు ధనుస్. ఆ తర్వాత అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా కోసం కోసం తన ‘ఇడ్లీ కడాయి’ సినిమాను వాయిదా వేశాడు. ఇప్పుడు అదే కోవలో ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ సినిమా వాయిదా వేస్తాడు అని అంటున్నారు. చూద్దాం మరి శాక్రిఫైస్ స్టార్ ధనుష్ ఏం చేస్తాడో.
















