దర్శకుడు శేఖర్ కమ్ముల హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా అంటూ సింపుల్ కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యేలా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అలాగే లీడర్ లాంటి మంచి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమా కూడా తీశాడు. ఇలాంటి దర్శకుడు బడా హీరోతో సినిమా చేస్తే మరో లెవెల్లో ఉంటుందని గత కొంతకాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి శేఖర్ కమ్ములకు ధనుష్ దొరికేశాడు. బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ అందుకున్న ధనుష్ టాలెంట్ గురించి అందరికి తెలిసిందే.
సరైన కథ దొరికితే ప్రాణం పెట్టి నటించగలడు. ఇక శేఖర్ కమ్ములతో ఈ హీరో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు త్రిభాషా సినిమాగా తెలుగు తమిళ్ హిందీలో ఒకేసారి తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. శేఖర్ కమ్ముల మన టాలీవుడ్ లో చాలా మంది అగ్ర హీరోలను సంప్రదించాడు. మహేష్ బాబుతో చేయాలని చాలాసార్లు అనుకున్నాడు. కానీ కమర్షియల్ గా ఆలోచించి సూపర్ స్టార్ ధైర్యం చేయలేకపోయాడు.
ఇక ధనుష్ అయితే కాస్త కొత్తగా ఆకనిపించినా రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక కమ్ముల సంగతి అందరికీ తెలిసిందే. లీడర్, హ్యాపీడేస్ లాంటి విభిన్నమైన సినిమాలను అందించగలడు. ఇక ఇప్పుడు ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. ఈ సినిమాను లవ్ స్టొరీ సినిమాను నిర్మించిన ఏషియన్ గ్రూప్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ లోనే తెరకెక్కించనున్నారు.