Dhanush, Sekhar Kammula: రేపు రాబోయే బిగ్ అనౌన్స్మెంట్ ఇదేనట..!

‘ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి’ బ్యానర్ వారు రేపు సునీత నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఓ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం వారి అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. రేపు అనగా జూన్ 18న ఉదయం 9 గంటలకు ఆ బిగ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు వారు తెలిపారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని కూడా పేర్కొన్నారు. దీంతో అందరిలోనూ ఉత్కంఠత పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు దీనిపై డిస్కషన్లు కూడా మొదలైపోయాయి.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ బిగ్ ప్రాజెక్టుని డైరెక్ట్ చేయబోయేది శేఖర్ కమ్ముల అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోగా ధనుష్ నటించబోతున్నట్టు వినికిడి. నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుష్కర రామ్ మోహన్ రావు.. కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు,తమిళ్ తో పాటు హిందీలో కూడా రూపొందనుందని సమాచారం. ఇటీవల ధనుష్ ను కలిసి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ ను వినిపించి ఇంప్రెస్ చేసాడట శేఖర్ కమ్ముల.

ధనుష్ కూడా సింగిల్ సిట్టింగ్ లో ఈ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసి.. ఈ ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఇదే బ్యానర్లో దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ ఎత్తేసిన వారం రోజుల తర్వాత ‘లవ్ స్టోరీ’ ని విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు తెలిపారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus