Dhanya Balakrishna: ఆ వైరల్‌ సీన్‌పై ధన్య బాలకృష్ణ క్లారిటీ..

  • May 16, 2021 / 09:39 PM IST

సినిమాలు హీరోలు చేసే ఫైట్లు, యాక్షన్‌ అంతా నిజం అనుకుంటుంటారు కొంతమంది. అందుకే మా హీరోలు సూపర్‌ అంటుంటారు. అయితే అవన్నీ యాక్షనే అని తెలుసు. అలానే సినిమాలో హీరోయిన్లు చేసేదంతా నిజం కాదు కూడా. హీరోలును కొట్టడం, తిట్టడం, మందు కొట్టడం లాంటివి కూడా నిజం కాదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే… ఓ సినిమాలో హీరోయిన్‌ మందు తాగుతున్నట్లు నటిస్తే .. నిజంగా తాగినట్లు కాదు. ఇప్పుడదంతా ఎందుకు అంటే… ధన్య బాలకృష్ణ గురించే.

‘లవ్‌ ఫెయిల్యూర్‌’ అనే సినిమాతో ధన్య బాలకృష్ణ వెండితెరకు పరిచమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందులో ఓ సన్నివేశంలో ఆమె మందు తాగినట్లు నటించాలి. ఆ సీన్‌లో ధన్య అద్భుతంగా చేసిందని చాలామంది మెచ్చుకున్నారు. అయితే ఆమె ఆ సీన్‌లో మందు తాగిందని పుకార్లు వచ్చాయి. అప్పట్లో ఒకసారి ఆమె స్పందించింది. తాజాగా మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఇటీవల ధన్య మాట్లాడింది.

లైవ్‌లో అభిమానులు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీన్‌లో మందు తాగలేదు. కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నాను. మరోవైపు పార్టీలు, ఫ్రెండ్స్‌ గురించి కూడా మాట్లాడింది. ధన్య ఎక్కువగా పార్టీలు చేసుకోదట. అయతే వీకెండ్స్‌లో స్నేహితులను ఎక్కువగా కలుస్తుందట. దాంతోపాటు వాళ్లతో భోజనానికి వెళ్లడం ఆమెకు అలవాటట. స్నేహితులతో లాంగ్‌ డ్రైవ్స్‌ వెళ్లడమన్నా ధన్యకు ఇష్టమట. అలాగే కాఫీ తాగడాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తుందట.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus