‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ మెగా లాంచ్

సరికొత్త డాన్సింగ్ టాలెంట్‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ టాలెంటెడ్ షో ఢీ. ఈ షోకు వ‌స్తున్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెరపై ఢీ షో క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతీ సీజన్‌కి ఓ కొత్త థీమ్, కొత్త యాంకర్లతో బరిలోకి దిగుతూ ఎప్పటికప్పుడు ఢీ షోకి ఉన్న రూపు రేఖలు మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ అంటూ మరిన్ని ప్రత్యేకమైన ఎపిసోడ్స్ ప్రసారం చేయబోతున్నారు.

‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ లో మొత్తం 12 మంది సెలబ్రిటీ కంటిస్టెంట్స్ ఉండబోతున్నారు. యాక్టర్ నందు ఈ షోను హోస్ట్ చేస్తుండ‌టం విశేషం. అలాగే పెర్ఫామెన్స్‌ల‌ను ప‌రిశీలించి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌టానికి ముగ్గురు జడ్జ్ లు ఉండనున్నారు. అందులో ఒకరిగా హీరోయిన్ హన్సిక రానుండ‌టం కొస‌మెరుపు. ఆమెకు సంబ‌ధించిన ప్రోమోను కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు టీవీ రంగంలోకే రాన‌టువంటి హ‌న్సిక మొట్ట మొద‌టిసారిగా ఓ బుల్లితెర షోకి జడ్జ్ గా రాబోతోంది. ఈమెతో పాటు స్టార్ కొరియోగ్రాఫ‌ర్స్‌ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జ్ లు ఉండనున్నారు. ఈ సీజన్‌ను గ‌త సీజ‌న్స్ కంటే వైవిధ్యంగా డిజైన్ చేస్తున్నారు. ఆ విష‌యం తాజాగా విడుదల చేసిన ప్రోమోతో స్పష్టమైంది. మరో విశేషం ఏంటనే ఇకపై ఈ షో వారానికి రెండు రోజులు ప్రసారం కానుంది.

ప్రతి బుధ, గురు వారాల్లో రాత్రి 9.30 నిమిషాల‌కు ఢీ సెలబ్రిటీ 2 మీకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. ఇది అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య జరిగే ఫన్ సిరీస్. అబ్బాయిల టీమ్ లీడర్ గా హైపర్ ఆది ఉండగా, అమ్మాయిల టీమ్ లీడర్ గా శ్రీ సత్య ఉంటుంది. అలాగే ఈ సారి షోలో మరో విశేషం కూడా ఉంటుంది. ఢీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి నేరుగా జడ్జ్ హన్సిక రోజా పువ్వు ఇస్తుంది. ప్రతి వారం అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వార్ ఆసక్తికరంగా ఉంటుందట. మొత్తంగా చూస్తే ఈ సారి ఢీ షో మరింత ఫన్ క్రియేట్ చేస్తుందన‌టంలో సందేహం లేదు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags