యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. యమదొంగ, కంత్రి, అదుర్స్, బృందావనం, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్.ఆర్.ఆర్ సినిమాలలో తారక్ తన డ్యాన్స్ స్టెప్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. దేవర సినిమాలో సైతం తారక్ అద్భుతమైన స్టెప్స్ తో అలరించనున్నారని తెలుస్తోంది. దేవర మూవీ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. అయితే ఢీ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న పండు తారక్ డ్యాన్స్ స్కిల్స్ గురించి తెగ మెచ్చుకున్నారు.
జై లవకుశ సినిమాలోని ట్రింగ్ ట్రింగ్ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అని జూనియర్ ఎన్టీఆర్ లొకేషన్ కు వచ్చి మాస్టర్ చూపించిన 32 కౌంట్స్ ను గుర్తు పెట్టుకుని డ్యాన్స్ చేశారని పండు కామెంట్లు చేశారు. డ్యాన్స్ మూమెంట్స్ ను గుర్తుంచుకుని స్టెప్స్ వేయడం డ్యాన్సర్లు అయిన మాకే కష్టమని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం డ్యాన్స్ స్టెప్స్ ను గుర్తు పెట్టుకుని మరీ స్టైలిష్ గా డ్యాన్స్ చేసి మెప్పించారని పండు వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంత షార్ప్ గా ఉన్నారేంటి అని అనిపించిందని పండు వెల్లడించారు. పండు చెప్పిన విషయాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి త్వరలో టీజర్ రిలీజ్ కానుండగా ఈ టీజర్ ఒకింత స్పెషల్ గా ఉండబోతుందని సమాచారం అందుతోంది.
కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం కమర్షియల్ గా సక్సెస్ సాధించి మంచి లాభాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!