Dheera Review in Telugu: ధీర సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • లక్ష్ చదలవాడ (Hero)
  • నేహా పఠాన్, సోనియా బన్సాల్ (Heroine)
  • మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు (Cast)
  • విక్రాంత్ శ్రీనివాస్ (Director)
  • పద్మావతి చదలవాడ (Producer)
  • సాయికార్తీక్ (Music)
  • క‌న్నా పీసీ (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 02, 2024

ఫిబ్రవరి మొదటి వారంలో చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ వారం అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అందులో లక్ష్ చదలవాడ హీరోగా రూపొందిన ‘ధీర’ ఒకటి. టీజర్, ట్రైలర్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కాస్ట్ లీగా కనిపించడం, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమా పై ఫోకస్ పెట్టారు. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : రణధీర్(లక్ష చదలవాడ) వైజాగ్ కి చెందిన వ్యక్తి. అతనికి డబ్బుపై వ్యామోహం ఎక్కువ. డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తాడు. ఫ్రీగా మాత్రం ఏ పని చేయడు. ఇంకా చెప్పాలంటే డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేసే మనస్తత్వం అతనిది.అలాంటి రణధీర్ కి ఓ ఫోన్ కాల్ వస్తుంది. అది ఓ హాస్పిటల్ నుండి వచ్చిన కాల్. రణధీర్ తో రాజ్ గురు అనే పేషెంట్ ని అంబులెన్స్ లో హైదరాబాద్ కి తీసుకెళ్తే..

రూ.25 లక్షలు డబ్బు ఇస్తామనేది ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం. పాతిక లక్షలు అనగానే అది టెంప్టింగ్ నెంబర్ గా భావించి రణధీర్ వెంటనే ఓకే చెప్పేస్తాడు. ఆ అంబులెన్స్ లో పేషెంట్ కి డాక్టర్ అమృత(నేహా పఠాన్) ట్రీట్మెంట్ ఇస్తుంది. తోడుగా మరో డాక్టర్ (మిర్చి కిరణ్) కూడా ఉంటాడు.ఇక రాజ్ గురుని హైదరాబాద్ కి తీసుకెళ్లే క్రమంలో ఓ ముఠా దాడి చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ దాడి చేసిన ముఠా వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అసలు రాజ్ గురు ఎవరు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: హీరో లక్ష్ సినిమా సినిమాకి నటుడిగా ఇంప్రూవ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన కటౌట్ కి తగ్గట్టు యాక్షన్ సీక్వెన్స్ లు.. డిజైన్ చేయించుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. అతని హార్డ్ వర్క్ కూడా ప్రతి సినిమాలో కనిపిస్తుంది. హీరోయిన్లు నేహా పఠాన్, సోనియా భన్సాల్ ఉన్నంతలో గ్లామర్ ఒలకబోసి ఆకట్టుకున్నారు. ‘మిర్చి’ కిరణ్ తన మార్క్ కామెడీతో కాసేపు నవ్వించాడు. భరణి శంకర్, వైవా రాఘవ్, భూషణ్ వంటి నటీనటులు ఉన్నంతలో ఓకే అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : సినిమాలో నిర్మాణ విలువలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఇది మెయిన్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ట్విస్ట్..లు, యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన పొలిటికల్ డ్రామా ఇది. డైరెక్టర్ విక్రాంత్ శ్రీనివాస్ ఐడియా బాగుంది. ఫస్ట్ హాఫ్ సో సోగా సాగింది.

సెకండ్ హాఫ్ బాగానే ఆకట్టుకుంటుంది.యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సాయి కార్తీక్ మ్యూజిక్ బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ డిజైన్ ఓకే. డైలాగ్స్ అక్కడక్కడా బాగానే పేలాయి

విశ్లేషణ : ‘ధీర’ (Dheera) ఫస్ట్ హాఫ్ పరంగా సో సోగా అనిపించినా.. సెకండ్ హాఫ్ ఆకట్టుకునే విధంగా ఉంది. యాక్షన్ మూవీ లవర్స్, మాస్ ఆడియన్స్ ని మెప్పించే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus