ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ‘ధృవ నక్షత్రం’ సినిమా ఎట్టకేలకు నవంబరు 24న విడుదలవుతుంది అంటూ మొన్నీమధ్య వరకు చదువుకున్నాం. అయితే సినిమా ఆ రోజు రాకపోవచ్చని, ఫైనాన్సియర్లకు చెల్లించాల్సిన బాకీ చాలా ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో సినిమా రిలీజ్ అవ్వడం కష్టం అని కూడా చెప్పారు. అనుకున్నట్లుగానే సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే కారణం ఆ డబ్బులు కాదు.. కానీ వేరే డబ్బుల కారణంగా సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడం లేదు.
అయితే కారణం చెప్పకుండా దర్శకనిర్మాత గౌతమ్ మేనన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం. విక్రమ్ – గౌతమ్ మేనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా వివిధ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు నవంబరు 24న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అయితే సినిమాకు అనుకోని సమస్య తలెత్తింది. అయితే దానికీ, సినిమాకు ఎలాంటి దగ్గర సంబంధం లేకపోవడం కారణం.
గతంలో గౌతమ్ మేనన్ ఓ సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకొని, చేయకపోవడమే ఇప్పుడు ఈ (Dhruva Natchathiram) సినిమా ఆగడానికి కారణం. శింబు హీరోగా గౌతమ్ మేనన్ ‘సూపర్ స్టార్’ అనే సినిమాను డైరెక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆల్ ఇన్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ నుండి రూ.2.4 కోట్లు తీసుకున్నారట. అయితే సినిమా పూర్తి చేయలేదని, డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ నిర్మాణ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ నగదు తిరిగి ఇవ్వకుండా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరింది.
గురువారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలను నిలిపేసింది. ఆల్ ఇన్ పిక్చర్స్ నుండి గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో సినిమా వస్తుందా, రాదా అనే టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ సమయంలో విషయం చెప్పకుండా సినిమాను వాయిదా వేస్తున్నామని, త్వరలో కొత్త తేదీ చెబుతాం అంటూ దర్శకుడు గౌతమ్ మేనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!