కుర్ర హీరో మీద కోట్ల పెట్టుబడి!

  • February 24, 2023 / 07:16 PM IST

‘కేజీఎఫ్’ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవ్వడంతో మెల్లగా కన్నడ స్టార్లు తమ సినిమాలను అన్ని భాషల్లో విడుదల చేయడం మొదలుపెట్టారు. సినిమాల బడ్జెట్ పెంచేసి.. కుర్ర హీరోలు నటించే సినిమాలను కూడా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ అంటూ హడావిడి చేస్తున్నారు. కన్నడ యంగ్ హీరో ధృవ సర్జా గురించి తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. మొన్నామధ్య ‘పొగరు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ధృవ సర్జా కండలు తిరిగిన దేహంతో.. ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. బి, సి సెంటర్స్ లో ఈ సినిమా బాగానే ఆడింది. ఇతడు నటించిన కొత్త సినిమా ‘మార్టిన్’. నిన్న బెంగుళూరులో టీజర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి తెలుగు మీడియాను స్పెషల్ గా బెంగుళూరు తీసుకెళ్లారు. అంత హడావిడి చేయడానికి చేయడానికి కారణం.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడమే.

టీజర్ ని బట్టి చూస్తుంటే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను నిర్మించారనిపిస్తుంది. మేకింగ్ మాములుగా లేదు. పాకిస్థాన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిన మార్టిన్ అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్టిన్ అసలు ఎందుకు ఆ డేంజరస్ వలలోకి వెళ్లాల్సి వచ్చిందనేది స్టోరీ. విజువల్స్ అయితే షాకింగ్ గా ఉన్నాయి. హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసినట్లు ఉన్నారు. యాక్షన్ సీన్స్ కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందని ‘పఠాన్’ నిరూపించింది.

అందుకే ‘మార్టిన్’ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో తెలుగు, తమిళ మార్కెట్ లో డిమాండ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు ఈ యంగ్ హీరో. ఇతడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. ఈ సినిమాకి ఆయనే కథ అందించారు. ఏపి అర్జున్ దర్శకుడు. మరి ఈ సినిమాతో ధృవ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus