Dia Mirza: దియామీర్జాకి ఆ అవకాశం వస్తుందా..?

హైదరాబాద్ కి చెందిన బ్యూటీ దియా మీర్జా.. రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే ఇన్నేళ్ల తన కెరీర్ లో మొదటిసారి ఆమె తెలుగు సినిమాలో నటించింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో దియా మీర్జా హీరోయిన్ గా కనిపించనుంది. తెలుగు సినిమాల్లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతోంది ఈ భామ. తనకు ఇష్టమైన హీరోలు నాగార్జున, వెంకటేష్ అని చెప్పింది దియా. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలలో తన అభిమాన హీరోలుగా వీళ్ల పేర్లే చెప్పానని వెల్లడించింది దియామీర్జా.

అలా తన అభిమాన హీరోల్లో ఒకరైన నాగార్జునతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపింది. నాగార్జున ఫ్యామిలీతో తమ ఫ్యామిలీకి చాలా కాలంగా పరిచయం ఉందని దియా చెబుతోంది. నాగార్జున మేనకోడలు సుప్రియ.. దియా చిన్నప్పటి స్నేహితులట. ఆ అనుబంధం అలానే కొనసాగుతూ వచ్చిందని దియా వెల్లడించింది. నాగార్జునతో నటించడం తనకు సగం సంతోషాన్ని ఇస్తోందని.. ఇక వెంకటేష్ తో నటిస్తే మరింత సంతోషంగా ఉంటానని దియా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది కాబట్టి వారికి దియా మీర్జా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ‘వైల్డ్ డాగ్’ సినిమాను శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus