మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 44 ఏళ్లుగా ఆయన ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ‘మరో 10 జెనరేషన్లకు ఆయన స్ఫూర్తి’ అనడంలో అతిశయోక్తి లేదు. ఎవరు ఏ పని చేసినా ఒకటి అవసరంతో చేస్తారు.. రెండు ఆకలితో చేశారు. కానీ మెగాస్టార్ మాత్రం ఇష్టంతోనూ, ప్రేమతోనూ చేస్తారు.అందుకే ఆయన ఇప్పటి స్టార్ హీరోలతో సమానంగా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే వారికి ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం చిరు బాడీ లాంగ్వేజ్ కు ఆయన ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది అని చెప్పాలి. ఈ చిత్రానికి అదిరిపోయే సంభాషణలు రాసింది లక్ష్మీ భూపాల. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చిరంజీవి గొప్పతనం గురించి ఈ తరానికి అర్ధమయ్యేలా చెప్పుకొచ్చారు. “నేను రాసిన డైలాగులు ఆయనకు నచ్చితే కనుక ఆ రికార్డింగ్ లను ఆయన సెట్లో ఉన్న వాళ్లందరినీ దగ్గరకు పిలిచి మరీ వినిపిస్తారు.
మనల్ని అభినందిస్తారు. ఇప్పటికీ ఆయన కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు. మనం రెండు పేజీలు, 4 పేజీలు డైలాగులు రాస్తే.. అవి పర్ఫెక్ట్ గా చెబితే తప్ప ఆయన షూటింగ్ కి ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్ళరు. కొంతమంది నటీనటులకు డైలాగ్ గుర్తురాకపోతే ప్రాంప్టింగ్ ఇచ్చేస్తారు. ఏదో ఒకటి డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని..! కానీ చిరంజీవి మాత్రం షాట్ ఓకే అయిపోయాక కూడా ఏమైనా మిస్ అయ్యిందా అని నన్ను అడిగితే..
అది ‘పర్వాలేదు సర్’ అని చెప్పినా సరే ‘వన్ మోర్’ అని చెప్పి అప్పుడు ప్యాకప్ చెబుతారు. ఆయన మెగాస్టార్ ఎందుకయ్యారో, 44 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఎందుకు రాణిస్తున్నారో నాకు అప్పుడు అర్ధమైంది. ‘ఆయన్ని ఇంకా ఇది చెయ్యాలి’ అనడానికి లేదు. అయినా ఏదో కొత్తగా చేయాలి, బాగా చేయాలి, అభిమానులను అలరించాలి అనేది ఆయన తపన” అంటూ ఓ ఫోటోని చూపించి మరీ చెప్పుకొచ్చారు లక్ష్మీ భూపాల.
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!