Koratala Siva: పెద్ద చర్చకు దారి తీసిన దర్శకుడు కొరటాల శివ లేటెస్ట్ ఫోటోలు..!

ఈరోజు అంటే జూన్ 15న కొరటాల శివ పుట్టినరోజు కావడంతో ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు అభిమానులు మరియు సినీ సెలబ్రిటీలు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోలు కొరటాలకు స్పెషల్ విషెస్ చెప్పారు. ‘ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. #Acharya సృష్టికర్త siva koratala కి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి..

కొరటాలకు విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. నిజానికి చిరు.. పదజాలం కూడా నెటిజన్లను ఆకర్షించింది అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ యూనిట్ సభ్యులు కొరటాల శివ కొత్త ఫోటోలు జత చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చరణ్ కూడా కొరటాలతో తీసుకున్న లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోల్లో కొరటాలకు ఫుల్ హెయిర్ ఉండటం విశేషం.నిజానికి కొరటాల శివ కి బట్టతల ఉండేది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నాలుగైదు వెంట్రుకలతో ఫ్రంట్ సైడ్ మొత్తం కవర్ చేసేస్తుంటారు కొరటాల . అయితే లేటెస్ట్ ఫొటోల్లో ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. దీంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. కొరటాల శివ ఏమైనా హెయిర్ కు సర్జరీ కానీ చేయించుకున్నారా? అని..! ఆయన వయసు 46 ఏళ్ళు మాత్రమే కదా చేయించుకుంటే.. తప్పేమి ఉంది..!


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus