Krishna: విగ్ర‌హావిష్క‌ర‌ణకు కృష్ణకు ఆహ్వానం అందిందా? లేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణకు ఊహించని స్థాయిలో గుర్తింపు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కృష్ణ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలు రికార్డులు సృష్టించాయి. కృష్ణ సినీ కెరీర్ లోని స్పెషల్ మూవీస్ లో అల్లూరి సీతారామరాజు ఒకటి. అల్లూరి సీతారామరాజు పేరు వినిపిస్తే ప్రేక్షకుల మదిలో కృష్ణ రూపం మెదులుతుంది. ఎంతోమంది స్టార్ హీరోలు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించినా కృష్ణ స్థాయిలో మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేదు.

సీనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలని ఆశపడినా కొన్ని కారణాల వల్ల ఆయన కోరిక నెరవేరలేదు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగగా కృష్ణ ఈ కార్యక్రమానికి హాజరవుతారని అందరూ భావించారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి కృష్ణకు ఆహ్వానం అందిందని అయితే వయస్సు, ఇతర కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని బోగట్టా.

మరో సీనియర్ హీరో కృష్ణంరాజుకు కూడా ఆహ్వానం అందిందని ఆరోగ్య సమస్యల వల్లే కృష్ణంరాజు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే కృష్ణ అభిమానులు మాత్రం కృష్ణ హాజరు కాకపోయినా కృష్ణ కుటుంబం నుంచి ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరై ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. కృష్ణ వల్లే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అల్లూరి సీతారామరాజు గొప్పదనం పూర్తిస్థాయిలో తెలిసిందని చెప్పవచ్చు.

తెలుగు ప్రేక్షకుల హృదయాలకు అల్లూరి సీతారామరాజు చేరువ కావడం వెనుక కృష్ణ పాత్ర ఎంతో ఉందనే సంగతి తెలిసిందే. కృష్ణ గత కొన్నేళ్లుగా సినిమాలకు, రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు మినహా ఇతరులను కలవాల్సి వస్తే కృష్ణ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus