Shah Rukh Khan: నోర్మూయ్ అంటూ నేటిజెన్కో దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన షారుక్!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు తాజాగా ఈయన పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా తర్వాత ఈయన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

జవాన్ సినిమా ద్వారా నటి నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమాలో షారుక్ హీరోగా నటించగా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తాజాగా (Shah Rukh Khan) షారుఖ్ ఖాన్ ను ప్రశ్నిస్తూ…జవాన్ సినిమా షూటింగ్ సమయంలో మీరు నయనతారతో ప్రేమలో పడ్డారా అంటూ ప్రశ్నించారు. ఇలా నేటిజన్ ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన షారుక్ సదరు నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా షారుక్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నోర్మూయ్… ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అంటూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు.

ఈ విధంగా షారుఖ్ ఖాన్ నయనతార గురించి చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సినిమా షూటింగ్ సమయంలో కొందరి హీరోలు ఇలా ప్రేమలో పడటం సర్వసాధారణం అయితే షారుఖ్ ఖాన్ చాలా సీనియర్ హీరో అలాగే నయనతార కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి. ఇలా నయనతార గురించి నేటిజన్ ఇలాంటి ప్రశ్న అడగడంతో షారుక్ కూడా తన స్టైల్ లో రియాక్ట్ అవుతూ సమాధానం చెప్పారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus