సుహాస్ (Suhas) ప్రామిసింగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. అతని సినిమాలు అంటే ప్రేక్షకులకి ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ ఏడాది సుహాస్ నుండి ఇప్పటికే ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ (Ambajipeta Marriage Band) ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) వంటి సినిమాలు వచ్చాయి. అవి రెండూ బాగానే ఉన్నా ‘అంబాజీపేట..’ రేంజ్లో ‘ప్రసన్నవదనం’ బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపలేకపోయింది. అయితే త్వరలో ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుహాస్. వాస్తవానికి సెప్టెంబర్ 7నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
Suhas
కానీ తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడంతో అక్టోబర్ 12కి వాయిదా వేశారు. ఈ గ్యాప్ లో సుహాస్ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘గొర్రె పురాణం'(Gorre Puranam). బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదల కాబోతోంది. విడుదలకి మరో 4 రోజులే ఉన్నప్పటికీ…చాలా మంది ప్రేక్షకులకి ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలీదు. అంటే ప్రమోషన్స్ ఎంత వీక్ గా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
అందరూ ఎలా ఉన్నా.. హీరో సుహాస్ కూడా ఈ సినిమా విడుదలని పట్టించుకోవడం లేదు అని స్పష్టమవుతుంది. ఎందుకంటే తన ట్విట్టర్లో ‘గొర్రె పురాణం’ గురించి ఒక్క ట్వీట్ కూడా వేయలేదు సుహాస్. అక్టోబర్ 12న రిలీజ్ అవుతున్న ‘జనక అయితే గనక’ గురించి మాత్రం తెగ ట్వీట్లు వేస్తున్నాడు.
దీంతో ‘ ‘గొర్రె పురాణం’ సినిమా రిలీజ్ అవ్వడం సుహాస్ కి కూడా ఇష్టం లేదనుకుంట’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ‘గొర్రె పురాణం’ కి ముందు ‘శ్రీరంగనీతులు’ (Sriranga Neethulu) అనే సినిమా కూడా వచ్చింది. దాన్ని కూడా సుహాస్ పెద్దగా ఆసక్తిగా ప్రమోట్ చేసింది లేదు.