Hema: శ్రీదేవి డూప్ గా హేమ ఏ సినిమాలో నటించారో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టతరమైనటువంటి సన్నివేశాలలో హీరో హీరోయిన్లకు బదులు వారి పోలికలతో ఉన్నటువంటి వారి సహాయంతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటారు ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలందరికీ కూడా డూప్స్ ఉంటారు. ఇలా కష్టతరమైనటువంటి సన్నివేశాలలో సెలబ్రిటీలకు బదులు వేరే వారు ఆ సన్నివేశాలలో నటిస్తూ ఉంటారు. అయితే అతిలోకసుందరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దివంగత నటి శ్రీదేవికి కూడా డూప్ ఉండేవారట. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి నటి హేమ గురించి అందరికీ తెలిసిందే.

ఈమె (Hema) ఎన్నో సినిమాలలో పిన్ని వదిన అక్క పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఒకప్పుడు ఎంతో నాజూగ్గా ఉన్నటువంటి ఈమె శ్రీదేవి పోలికలతో ఉండడంతో ఒక సినిమాలో శ్రీదేవికి బదులు ఈమె ఆ పాత్రలో నటించారని తెలుస్తోంది. శ్రీదేవి నటించిన సినిమాలో ఆమెకు బదులు హేమ నటించినటువంటి సినిమా ఏంటి అసలు ఎందుకు హేమా నటించాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే..

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి అచ్చం దేవకన్య లాగే అందరిని మెప్పించారు. ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశంలో శ్రీ దేవికి బదులు హేమ నటించారు. శ్రీదేవి ఒక సన్నివేశంలో భాగంగా నీళ్లల్లో ఈదే సన్నివేశం ఉంది. అయితే శ్రీదేవికి ఈత రాకపోవడంతో ఆ సన్నివేశంలో తాను నటించలేనని తెలియజేశారు.

ఈ విధంగా శ్రీదేవికి ఈతరానీ పక్షంలో ఆమె స్థానంలో నటి హేమ నటించారు. ఇలా శ్రీదేవికి నటి హేమ డూప్ గా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించారని తెలుస్తుంది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus