Kota Bommali P.S: ‘నాయట్టు’ రీమేక్ అయిన ‘కోట బొమ్మాళి P.S’ మోషన్ పోస్టర్లో ఇవి గమనించారా!

మలయాళంలో హిట్ అయిన ‘నాయట్టు’ చిత్రం తెలుగులో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కోట బొమ్మాళి P.S’ పేరుతో రూపొందిస్తున్నారు. ఇది రాజకీయాలు మరియు పోలీసుల మధ్యజరిగే పరిణామాలు ఉన్న కథ. బన్నీ వాస్,విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్‌(ప్రత్యేక పాత్ర), రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ వంటి వారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇందులో పరారిలో ఉన్న (Kota Bommali P.S) కోట బొమ్మాళి పోలీసులను చూపించారు. రాజకీయాలు మరియు పోలీసు బలగాలకు సంబంధించిన తుపాకులు, బ్యాలెట్ పేపర్లు, వంటివి ఈ మోషన్ పోస్టర్ లో కనిపించాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ‘నాయట్టు’ రీమేక్ కి డైరెక్టర్ గా ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు జోహార్, అర్జున ఫాల్గుణ చిత్రాలను రూపొందించిన దర్శకుడు తేజ మార్ని ఈ రీమేక్ ను రూపొందిస్తున్నాడు.

ఇక మొదట రావు రమేష్ ను కీలక పాత్రకి ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు అతని ప్లేస్ లో శ్రీకాంత్ ను తీసుకున్నారు. అలాగే లేడీ పోలీస్ గా అంజలిని మొదట ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో శివాని రాజశేఖర్ ను తీసుకున్నారు. ఓవర్ బడ్జెట్ కారణంగా వారు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus