ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టం. ఓ లిస్టు చెప్పుకుంటే చిరంజీవి, రవితేజ, వంటి వారు తప్ప మిగిలిన హీరోలంతా పలుకుబడి బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళే. అయితే ఇటీవల కాలంలో నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా ఆ లిస్టు లో జాయిన్ అయ్యారు. వీళ్లిద్దరికీ కూడా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు. అయినప్పటికీ మినిమం గ్యారెంటీ హీరోలుగా చెరగని ముద్ర వేసుకున్నారు.
నాని మార్కెట్ 30 కోట్ల వరకూ ఉంది. ఇతని నటనతో ఎటువంటి సినిమాని అయినా బోర్ కొట్ట కుండా నడిపించగలడు. ఇంకా చెప్పాలంటే..ఒంటి చేత్తో సినిమాని గట్టు ఎక్కించగల కెపాసిటీ ఉన్న నటుడు. ఈ మధ్యన నిర్మాతగా కూడా మారి రాణిస్తున్నాడు. అయితే సేఫ్ అంతకు మించి ప్రయత్నించకపోవడం.. సేఫ్ గేమ్ ఆడేసి 3 సినిమాలు చేయడంతోనే సరిపెట్టేయడం ఇతని మైనస్ పాయింట్ అని చెప్పాలి. అయితే ‘వి’ చిత్రంతో ఆ ఫీల్ పోగొడతాడేమో చూడాలి.
ఇక విజయ్ దేవరకొండ … ‘పెళ్ళి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ చిత్రాలతో అతి తక్కువ సమయంలొనే స్టార్ హీరో రేంజ్లో దూసుకొచ్చాడు. కాని ఆ తరువాతి నుండీ ఒకేరకమైన సినిమాలు.. ఓకే రకమైన యాక్టింగ్ తో విసుగు పుట్టించాడనే చెప్పాలి. థియేటర్ ఆర్టిస్ట్ అయిన విజయ్ చాలా బాగా నటించగలడు. కథల పై కూడా ఆయన ఫోకస్ పెట్టి … ఆటిట్యూడ్ అనే ఫీవర్ తగ్గించుకుంటే ఇతను కూడా పెద్ద స్టార్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి పూరీతో చేస్తున్న సినిమాతో ఆ స్థాయికి వస్తాడేమో చూడాలి..!
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్