Kubera and Idli Kottu: కుబేర X ఇడ్లీకొట్టు: టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎంత తేడానో చూశారా?

‘కుబేర’ సినిమాతో కొన్ని రోజుల క్రితం ధనుష్‌ – నాగార్జున – శేఖర్‌ కమ్ముల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా చూసిన సగటు ప్రేక్షకులు నాగార్జున పాత్రను, ధనుష్‌ నటనను తెగ మెచ్చుకున్నారు. శేఖర్‌ కమ్ముల నెరేషన్‌కి ఫిదా అయిపోయారు. అయితే ఇదంతా తెలుగు ప్రేక్షకుల వరకు మాత్రమే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాకు కేవలం తెలుగు ప్రేక్షకుల నుండి ప్రశంసలు రావడం ఏంటి అనుకుంటున్నారా? అదే ఇక్కడ మ్యాజిక్‌. నటన, పాత్ర, టేకింగ్‌ రెండు రెండు భాషల్లో రావాల్సిన ప్రశంసలు రాలేదు.

Kubera and Idli Kottu

ధనుష్‌ గొప్ప నటుడు అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే పనితనాన్ని ఆ సినిమాలో కూడా చూపించారు. కానీ కోలీవుడ్‌ సినిమాకు ఆశించిన రెస్పాన్స్‌ రాలేదు. ఇక మొన్నీమధ్య వచ్చిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమాలో ధనుష్‌ తన నటనతో ఇరగదీశాడు. పాత్రలో పార్శ్వాలను చూపించిన విధానం అందరికీ నచ్చేసింది. ఇక్కడ అందరికీ అంటే కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే. ఎందుకంటే ఆ సినిమా మన దగ్గర ఇబ్బందికర ఫలితాన్నే అందుకుంది. ఏదో సగటు కథ, ధనుష్‌ తన నటనతో లాక్కొచ్చాడు అని విశ్లేషకులు రాసుకొచ్చారు. అయితే తమిళనాట సినిమాకు భారీ విజయమే దక్కింది.

దీంతో, రెండు సినిమాల్లో ఏ మాత్రం తేడా లేని ధనుష్‌కి రెస్పాన్స్‌ ఎందుకు డిఫరెంట్‌గా వచ్చింది అనే ప్రశ్న మొదలైంది. రెండు కథలు బాగుండి, రెండింటిలో ధనుష్‌ అదరగొట్టగా.. తెలుగు వాళ్లకు ‘ఇడ్లీ కొట్టు’ ఎందుకు అంతగా నచ్చలేదు.. తమిళవాళ్లకు ‘కుబేర’ ఎందుకు నచ్చలేదు అనేదే డిస్కషన్‌ పాయింట్‌. ‘కుబేర’లో ధనుష్‌ నటనకు జేజేలు కొట్టినా.. ఆ సినిమాను అక్కడివారు ఆదరించలేదు. కానీ అలాంటి నటనే చేసి చూపించిన ‘ఇడ్లీ కొట్టు’ను మాత్రం ఆశీర్వదించారు.

దీనికి కారణమేంటా అని ఆలోచిస్తే.. నేటివిటీ అని ఓ ఆన్సర్‌ దొరుకుతోంది. ‘ఇడ్లీ కొట్టు’ / ‘ఇడ్లీ కడై’ సినిమాలో తమిళనాడు లోకల్‌ టచ్‌ బాగా కనిపిస్తుంది. అందుకే బాగా కనెక్ట్ అయ్యారు. అలా అని ‘కుబేర’ టాపిక్‌ వారికి దూరమేమీ కాదు. ఎందుకంటే ఆ టాపిక్‌ దేశం మొత్తం సాగుతున్నదే. ‘కుబేర’ వర్సెస్‌ ‘ఇడ్లీ కొట్టు’లో నేటివిటీనే గెలిచింది అనిఇ చెప్పాలి.

సంక్రాంతి జోరు.. టికెట్ రేట్ల పెంపు.. ఈ ఏడాది 300 కోట్ల సినిమాల్లో మేటి ఏది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus