Aditya Hasan: ‘బాయ్స్‌’లో మెయిన్‌ పాయింట్‌తో ‘స్వాతి టీచర్‌’ నిజమేనా?

ఒక వేశ్య… ఆమె దగ్గరకు వెళ్లిన నలుగురు కుర్రాళ్లు… అనుకున్నట్లుగా అక్కడేమీ జరగలేదు. అయితే ఆ నలుగురి జీవితాన్ని ఆమె మార్చేసింది. ఎలా మార్చేసింది, ఏం మార్చేసింది. ఇదీ త్వరలో తెలుగులో రూపొందబోతున్న ఓ సినిమా కథ. ఏంటీ ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. సేమ్‌ టు సేమ్‌ పాయింట్‌తో గతంలో మన దగ్గర ఓ సినిమా వచ్చింది. అయితే మొత్తం సినిమాలో అదొక టర్నింగ్‌ పాయింట్‌ మాత్రమే. అయితే ఇప్పుడు ఇదే మెయిన్‌ పాయింట్‌గా ఓ సినిమా రూపొందుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

తెలుగులో ఇటీవల కాలంలో మంచి విజయం అందుకున్న తెలుగు వెబ్‌ సిరీస్‌ అంటే #90s అని చెప్పాలి. శివాజీ (Sivaji) , వాసుకి (Vasuki Anand) ప్రధాన పాత్రల్లో నటించిన ఆ ఎమోషనల్ డ్రామా భారీ విజయాన్నే అందుకుంది. దీని వెనుకున్న మాస్టర్‌ మైండ్‌ ఆదిత్య హాసన్ (Aditya Haasan). ఈ యువ దర్శక రచయిత ఆ తర్వాత ‘ప్రేమలు’ (Premalu) సినిమా తెలుగు వెర్షన్‌కు మాటలు రాసి వావ్‌ అనిపించారు. ఇప్పుడు ఆయనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘స్వాతి టీచర్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ ఇదే అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నిజానికి వెబ్‌ సిరీస్‌ కోసం రాసుకున్న ఈ కథను ఇప్పుడు సినిమాగా మార్చి తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ ఇదే అంటూ వినిపిస్తున్న టాక్‌ ప్రకారం అయితే… నలుగురు టీనేజ్ కుర్రాళ్లు ఒక వేశ్య దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట.

అలా అని ఇదేమీ బోల్డ్‌ సినిమా కాదట. ఎలాంటి అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తారట. నవీన్ మేడారం (Naveen Medaram)  నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయిపోయింది. ఇందులో నటించబోయే టీమ్‌ అంతా మనకు వివిధ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తెలిసిన ముఖాలే అంటున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus