అప్పట్లో రాజులు, మహర్షులు దేవుడి మెప్పు పొందడం కోసం యాగాలు, తపస్సులు చేసేవారట. ఇప్పుడు హీరోయిన్లు కూడా అదే తరహాలో దర్శకనిర్మాతల చూపు తమవైపుకు తిప్పుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో “పి.ఆర్” స్టంట్ ఒకటి. ఏమీ చేయకపోయినా ఏదో చేసేసినట్లు పబ్లిసిటీ చేయించుకొని ఏదో ఒకరకంగా వార్తల్లో నిలవడం ఆ కార్యక్రమంలో ముఖ్య అంశం. అయితే.. ఇప్పటివరకు బాలీవుడ్ హీరోయిన్స్ బ్యాచ్ మాత్రమే ఇలాంటి టెక్నీక్ వాడేవారు. అందుకే వాళ్ళు ఏం చేసినా ఎంటర్ టైన్మెంట్ పేజ్ లో హాఫ్ పేజ్ వచ్చేది.
బాలీవుడ్ నుంచి దిగుమతైన దిగంగనా ఇప్పుడు ఆ పి.ఆర్ స్టంట్లతోనే పాపులర్ అవ్వాలని తహతహలాడుతోంది. కార్తికేయ హీరోగా తెరకెక్కిన “హిప్పీ” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దిగంగనా అంతకుమునుపు హిందీలో ముసలి హీరో గోవిందాతో రెండు సినిమాలు చేసింది. అవి విడుదలైనట్లు కూడా జనాలకు తెలియదనుకోండి. అయితే.. హిప్పీలో అమ్మడి అందాలు, శృంగార సన్నివేశాలు యువతను గట్టిగానే ఆకర్షించాయి. కానీ.. మంచి హైప్ తో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో టాలీవుడ్ జనాలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.

ఆ తర్వాత కూడా ఒకట్రెండు సినిమాలు చేసింది కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఇప్పుడు కుదిరినప్పుడల్లా వార్తల్లో నిలవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ పి.ఆర్ హడావుడి ఆమెకు ఏమేరకు లాభం అనేది తెలియదు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Most Recommended Video
ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
