దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ .. ఈ లాక్ డౌన్ టైంలో ఓటిటిలో విడుదల అయినప్పటికీ.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎమోషనల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. జూలై 24 న ‘హాట్‌స్టార్+డిస్నీ’ డిజిటల్ ప్లాట్ ఫామ్లో విడుదలైన ఈ చిత్రం 24 గంటల్లో 95 మిలియన్ వ్యూస్ నమోదు చేసినట్టు సమాచారం.
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ ’ వెబ్ సిరీస్ కు వచ్చిన వ్యూస్ నే ‘దిల్ బెచారా’ అధిగమించినట్టు తెలుస్తుంది. సుశాంత్ చివరి చిత్రం కావడంతో.. సింపతీ కొద్దీ కూడా ఎక్కువ మంది చూసినట్టు తెలుస్తుంది. అందులోనూ ‘నెపోటిజం’ ఇష్యూ కూడా ట్రెండింగ్ లో ఉండడంతో ‘దిల్ బెచారా’ కి ఎక్కువ ప్రమోషన్ జరిగినట్టు స్పష్టమవుతుంది. హాట్ స్టార్ వారు కూడా సబ్ స్క్రైబర్స్ తో పాటు నాన్ సబ్ స్క్రైబర్స్కు కూడా ఈ చిత్రాన్ని ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించారు.
ఒకవేళ ‘దిల్ బెచారా’ సినిమా థియేటర్లు ఓపెన్ ఉన్న టైంలో విడుదలయ్యి ఉంటే టికెట్ ధర రూ. 100 చొప్పున ..950 కోట్ల వరకూ కలెక్షన్లను రాబట్టి ఉండేది.ఇక పి.వి.ఆర్ సినిమాస్ లో టికెట్ ధర రూ. 207 చొప్పున అయితే రూ. 2000కోట్లు దాటి ఉండేదని చెప్పొచ్చు.ఏమైనా నిర్మాతకు మాత్రం ఈ చిత్రం లాభాల్ని తెచ్చిపెట్టింది.