సుశాంత్ ఫ్యాన్స్ కోరికకు విరుద్ధంగా దిల్ బిచారా నిర్మాతల నిర్ణయం

మనస్తాపంతో సుశాంత్ సింగ్ ప్రాణాలు తీసుకోవడం దేశంలోని అన్ని చిత్ర ప్రముఖులను, ఆయన ఫ్యాన్స్ మరియు కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. బాలీవుడ్ తనపై చూపిన వివక్ష, అందివచ్చిన అవకాశాలు చేయిజారడం, జీవితంలో కోరుకున్న తోడు దొరకకపోవడం వంటి అనేక కారణాలు ఆయన చావుకు కారణం అయ్యాయని తెలుస్తుంది. ఇక సుశాంత్ మరణానికి బాలీవుడ్ లో ఉన్న నేపోటిజం కారణం అని సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరుగుతుంది.

బాలీవుడ్ లో పాతుకుపోయిన కొందరు, ఎటువంటి నేపథ్యం లేని నటులను తొక్కేస్తున్నారని..సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సల్మాన్, అలియా భట్, కరణ్ జోహార్, కరీనా కపూర్ వంటి నటులను టార్గెట్ చేసి వారిని ట్రోల్ చేస్తున్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం దిల్ బిచారా విడుదలకు సిద్దముగా ఉంది. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సివుండగా…థియేటర్స్ బంధ్ కారణంగా ఆ మూవీ విడుదల కాలేదు. ముంబైలో కరోనా అత్యంత ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్స్ ప్రారంభం అయ్యే సూచనలు లేవు.

దీనితో దిల్ బిచారా మేకర్స్ ఓ టి టి విడుదలకు సిద్ధం అయ్యారు. దిల్ బిచారా జులై 24నుండి డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది. ఐతే సుశాంత్ ఫ్యాన్స్ కి ఇది ససేమిరా ఇష్టం లేదు. వారు సోషల్ మీడియా వేదికగా దిల్ బిచారా థియేటర్స్ లో విడుదల చేయాలని కోరుకుంటున్నారు. సుశాంత్ చివరి చిత్రానికి భారీ నివాళి ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే వాళ్ళు ట్విట్టర్ లో దిల్ బిచారా ఆన్ బిగ్ స్క్రీన్ అని ట్రెండ్ చేస్తున్నారు. హీరో సుశాంత్ ఆత్మ సైతం థియేటర్ రిలీజ్ వలన ఆనందపడే అవకాశం ఉంది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus