సంక్రాంతి సినిమాలు… టాలీవుడ్‌లో చాలా రోజులుగా ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు ఉన్నాయి. దీంతో అన్ని సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమని, ఒకవేళ వచ్చినా చాలా ఇబ్బంది అవుతుంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ప్రొడ్యూసర్లు కానీ, నిర్మాతల మండలి కానీ ఎందుకు మాట్లాడటం లేదు అనే ప్రశ్న మొదలైంది. అయితే ఈ విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు అంటూ ఓ వార్త బయటికొచ్చింది.
తాజాగా, ఈ విషయంలో దిల్ రాజునే (Dil Raju) స్పష్టత ఇచ్చారు. సంక్రాంతి రిలీజ్ డేట్‌లు ఇచ్చిన ఐదుగురు నిర్మాతలతో మాట్లాడాం అని చెప్పారు. అంతేకాదు ఓ నిర్మాతకు ఇచ్చిన డీల్ గురించి కూడా చెప్పారు. సంక్రాంతికి రానున్న 5 చిత్రాల్లో ఒకటో, రెండో తగ్గితే మిగతా సినిమాలకు థియేటర్లు సక్రమంగా సరిపోతాయి అని సమావేశంలో చెప్పాం అని దిల్ రాజు తెలిపారు. అయితే తమ ప్రతిపాదనకు ఒకవేళ ఎవరూ అంగీకరించకపోతే అన్ని సినిమాలూ పండగకే వస్తాయని చెప్పారు.
కొన్ని సినిమాలు వెనక్కి తగ్గిదే బాగుంటుందని, లేకపోతే అన్ని సినిమాలకూ న్యాయం జరగదని క్లారిటీ ఇచ్చేశారు దిల్ రాజు. సంక్రాంతికి రావాల్సిన తన సినిమా (ఫ్యామిలీ స్టార్)ను మార్చి నెలకు వాయిదా వేసుకున్నాను. మిగతా ఐదుగురిలో ఎవరో ఒక్కరు తగ్గితే వాళ్లకు ఆ తర్వాత సోలో డేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ విషయంలో ఎవరు ఏం చేస్తారు అనేది ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది అని చెప్పారు.
‘గుంటూరు కారం’ సినిమను పండగ సందర్భంగా విడుదల చేస్తామని నిర్మాతలు ముందుగానే చెప్పారు. మిగిలిన నలుగురిలో ఎవరైనా తగ్గాలి. ఈ విషయమే దిల్ రాజు నిర్మాతలకు చెప్పారు. అయితే ఆయన ‘హనుమాన్’ సినిమా టీమ్‌నే వాయిదా వేసుకోమన్నారు అంటూ ఓ వార్త ఈ మధ్య సినీ పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో తెలిస్తే ఈ విషయంలోనూ క్లారిటీ వచ్చేస్తుంది.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!