Dil Raju: దిల్‌ రాజు ఆలోచన ఏంటబ్బా… అంత ధైర్యం ఎక్కడిది

దిల్‌ రాజు తన నిర్మాణ సంస్థలో 50 సినిమాల దగ్గరకు వచ్చేశారు. శంకర్‌ – రామ్‌చరణ్‌ కాంబోలో ఆ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రకటించారు. అయితే హాఫ్‌ సెంచరీ కొట్టేసిన ఊపులో దిల్‌ రాజు జోరు పెంచారా? ఆయన నెక్స్ట్‌ ప్రాజెక్టుల లెక్కలు వింటుంటే అదే అనిపిస్తోంది. విజయ్‌ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్‌ రాజు ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్‌ లెక్కలే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది రెండు ఇండస్ట్రీలుగా ఉంది. కారణం ఈ సినిమాకు దిల్‌ రాజు ₹160 కోట్లు – ₹180 కోట్లు పెడుతున్నాడని అంటున్నారు.

విజయ్‌తో సినిమా అంటే… కోట్లలో లెక్కే. సినిమాల్లో భారీతనం లేకపోయినా విజయ్‌ని చూసే కోట్లు పోసి సినిమాలు కొంటుంటారు బయ్యర్లు. అందుకు తగ్గట్టుగానే సినిమా వసూళ్లు కూడా ఉంటుంటాయి. మన దగ్గర కూడా విజయ్‌కు మంచి మార్కెట్టే ఉంది. ఈ ధైర్యంతోనే దిల్‌ రాజు ఈ సినిమాకు అంత ఖర్చు పెట్టడానికి ముందుకొస్తున్నారని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం విజయ్‌కు ₹70 కోట్లు నుండి ₹90 కోట్ల వరకు ఇవ్వడానికి ముందుకొచ్చారట దిల్‌ రాజు. ఇప్పుడు ఇదే చర్చ.

‘వకీల్‌ సాబ్‌’ సినిమాకు లాభాలతో కలుపుకొని పవన్‌కు ₹60 కోట్లు – ₹70 కోట్లు వరకు ముట్టిందని టాక్‌ వచ్చింది ఆ మధ్య. దాంతో అందరూ అంత రెమ్యూనరేషనా అని నోళ్లు వెళ్లబెట్టారు. అందులో నిజం ఎంతో తెలియకపోయినా చర్చ అయితే నడిచింది. ఇప్పుడు విజయ్‌కు ఇంత ఇవ్వడం పెద్ద విషయమే అంటున్నారు. అయితే విజయ్‌కు ముందు చెప్పుకున్నట్లు సౌత్‌లో మంచి పేరే ఉంది. దీంతో ఇచ్చినదానికి ఎక్కువ తిరిగి రాబట్టొచ్చని దిల్‌ రాజు భావిస్తున్నారట.

ఈ లెక్కన విజయ్‌ సినిమాకే ₹180 కోట్లు పెట్టడానికి దిల్‌ రాజు ముందుకొచ్చారంటే… రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమాకు ఇంకెంత పెడుతున్నారో మరి. ముందుగా వార్తలొచ్చినట్లు ₹150 కోట్ల బడ్జెట్ అనేది అబద్దమే అవుతుంది మరి. కనీసం ₹200 కోట్లు – ₹250 కోట్ల వరకు ఆ సినిమా బడ్జెట్‌ ఉంటుందని తాజాగా అంటున్నారు. బడ్జెట్‌ లెక్కలు కాబట్టి అధికారిక సమాచారాలు ఏమీ ఉండవు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus