Dil Raju, Vijay: బైలింగ్యువల్ ప్రాజెక్ట్ పై విజయ్ కామెంట్స్ వైరల్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్… మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లితో ఓ మూవీ చేయబోతున్నాడు. దిల్ రాజు ఆ మూవీకి నిర్మాత. రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. విజయ్ కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ గా రూపొందింది. ఈ మూవీ కోసం అతను దాదాపు రూ.70 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. బైలింగ్యువల్ మూవీ కాబట్టి..

తమిళ్ లో విజయ్ మార్కెట్ రూ.200 కోట్లు పైనే ఉంది కాబట్టి..పారితోషికం ఆ మాత్రం ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇది బైంగ్యువల్ మూవీ కాదని విజయ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘బీస్ట్’ ప్రమోషన్లలో భాగంగా విజయ్ పాల్గొన్న ఇంటర్వ్యూలో దిల్ రాజు- వంశీ పైడిపల్లి మూవీ పై అతను స్పందించాడు. మీకు టాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నారు ఎలా ఫీలవుతున్నారు? అంటూ యాంకర్ ప్రశ్నించగా.

అందుకు విజయ్… ‘ఇది బైలింగ్యువల్ మూవీ కాదు. నా గత సినిమాల్లానే ఇది కూడా తెలుగులో డబ్ అవుతుంది అంతే’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. దీంతో దిల్ రాజు గాలి తీసేసినట్టు అయ్యింది. నిజానికి ‘మాస్టర్’ టైములో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో విజయ్ తెలుగు స్ట్రైట్ మూవీ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ సడెన్ గా దిల్ రాజు ఎంట్రీ ఇచ్చారు. ‘మైత్రి’ వారికంటే ముందుగా దిల్ రాజు…

విజయ్ తో స్ట్రైట్ మూవీ చేస్తున్నట్లు..ఇది బైలింగ్యువల్ మూవీ అన్నట్టు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇది కేవలం తమిళ్ లో తీసి తెలుగులో డబ్ చేసే మూవీ అని విజయ్ తేల్చి చెప్పేసాడు. మరి దిల్ రాజు రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి…!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus