Dil Raju: హరీష్ వర్సెస్ చోటా.. ‘రామయ్యా వస్తావయ్యా’ పై దిల్ రాజు ఓపెన్ కామెంట్స్ వైరల్!

ఇటీవల చోటా కె నాయుడు (Chota K. Naidu) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘రామయ్యా వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) సినిమా ప్రస్తావన తీసుకురావడం.. పనిలో పనిగా దర్శకుడు హరీష్ శంకర్  (Harish Shankar) పై సెటైర్లు వేయడం జరిగింది.’రామయ్యా వస్తావయ్యా’ సినిమా టైంలో హరీష్ బాగా విసిగించాడు, తన పనికి అడ్డుపడ్డాడు’ అనేది చోటా కె నాయుడు సెటైర్. దీనికి కౌంటర్ గా హరీష్ శంకర్ ఓ లెటర్ రిలీజ్ చేయడం అందులో ‘ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఆడలేదు అనడం’ కూడా జరిగింది.

వీరి వివాదం వల్ల ‘రామయ్యా వస్తావయ్యా’ ప్రస్తావన తీసుకు వచ్చి దాని ఫలితాన్ని కూడా గుర్తు చేయడం అనేది ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ కి ఇరిటేషన్ తెప్పించింది. దీంతో ఈ సినిమా ప్లాప్ అవ్వడం పై గతంలోనే దిల్ రాజు (Dil Raju) స్పందించారు. ఆ కామెంట్స్ ని కొంతమంది నెటిజన్లు మరోసారి గుర్తు చేస్తున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ….” ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా కథ ముందుగా మేము అనుకున్నది వేరు. దర్శకుడు హరీష్ శంకర్ మాకు ముందుగా వేరే కథ వినిపించాడు.

కానీ ‘రెబల్’ (Rebel) వచ్చాక.. మా కథ మార్చుకోవాల్సి వచ్చింది. తర్వాత ఫలితం మీకు తెలిసిందే. అనుకున్నట్టు రాలేదు. ‘రామయ్యా వస్తావయ్యా’ కనుక ముందుగా మేము అనుకున్న కథతో చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ‘తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు రివెంజ్ తీర్చుకోవడం’ అనేది మార్చాల్సి వచ్చింది. సో ‘రామయ్యా వస్తావయ్యా’ ప్లాప్ అవ్వడానికి కారణం టైం. దాన్ని మేము అందరం మోయాల్సిందే’ అంటూ” గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus