ఫిదా తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న దిల్ రాజు
- August 22, 2017 / 06:36 AM ISTByFilmy Focus
తెలుగులో సక్సస్ ఫుల్ నిర్మాతగా దిల్ రాజు నిరూపించుకున్నారు. అతి తక్కువ సమయంలో 26 చిత్రాలను నిర్మించి అధిక సక్సస్ రేట్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫిదా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలంగాణ నేపథ్యంలో సాగిన ఈ మూవీ బడ్జెట్ కి మూడు రెట్లు కలక్షన్స్ సాధించింది. వరుణ్ తేజ్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి రాగా, సాయి పల్లవి భానుమతిగా అందరి మనసులను గెలుచుకుంది. అన్ని వైపులా నుంచి అభినందనలు రావడంతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనీ దిల్ రాజు భావిస్తున్నారు.
తెలంగాణ నేపథ్యాన్ని పంజాబ్ బ్యాక్ డ్రాప్ గా మార్చనున్నట్లు తెలిసింది. ఈ కథలో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. సూపర్ హిట్ కథ అక్కడ కూడా హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో దిల్ రాజు బాలీవుడ్ లో అద్భుతమైన కథతోనే ఎంట్రీ ఇస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














