సౌత్ లో టాప్ ప్రొడ్యూసర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు అల్లు అరవింద్. రాజమౌళి సినిమాలు కాకుండా మిగిలిన సినిమాలు ఆల్ టైం టైం రికార్డులు కొట్టేవి ఏవైనా ఉంటే.. అవి ‘గీత ఆర్ట్స్’ ఫ్యాక్టరీ నుండీ వచ్చే సినిమాలే అవుతాయి. ఇక ఆయన రెండో బ్యానేర్ ‘జిఏ2 పిక్చర్స్’ లో కూడా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి.. వాటితో కూడా అద్భుతమైన విజయాలు నమోదయ్యేలా చూసుకుంటూ ఉంటారు అల్లు అరవింద్ గారు. ఇక భవిష్యత్తు అంతా ఓటిటి ప్లాట్ ఫామ్స్ పైనే ఉందని ముందే గ్రహించిన.. ఈ మాస్టర్ మైండ్ ప్రొడ్యూసర్.. సొంతంగా ఓటీటీ ప్లేట్ ఫామ్స్ ను కూడా ఏర్పాటు చేసుకుని అటువైపుగా అడుగులు కూడా వేసేసారు. ‘మై హోం’ సంస్థ భాగస్వామ్యంతో అల్లు అరవింద్‌తో దీన్ని నెలకొల్పారు. ఇందులో ఎక్కువగా మెగా హీరోల సినిమాలే ఉండటం విశేషం. ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉందట. ఏడాదికి 369 రూపాయలు, మూడు నెలలకు 149 రూపాయల చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెట్టినట్టు తెలుస్తుంది.
ఇక అల్లు అరవింద్ తర్వాత ఆ రేంజ్లో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ అంటే కచ్చితంగా దిల్ రాజు పేరే చెప్పాలి. తన సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూనే… డిస్ట్రిబ్యూటర్ గా కూడా రాణిస్తున్నారు. ఇక ‘పిల్లా నువ్వులేని జీవితం’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. అరవింద్ గారి లానే దిల్ రాజు కూడా సొంతంగా ఓటిటి ప్లేట్ ఫామ్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. తాను నిర్మిస్తున్న సినిమాలని వేరే వారికి అమ్ముకోవడం దేనికి… సొంతంగా ఓ ఓటిటి ప్లాట్ ఫామ్ ఉంటే.. మనమే క్యాష్ చేసుకోవచ్చు కదా అని భావించి… ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!