దిల్ రాజు (Dil Raju) ఒకప్పుడు ఎక్కువగా కొత్త దర్శకులతోనే వరుస విజయాలతో మంచి ప్రాఫిట్స్ అందుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో ఆయన కొత్త దర్శకుల కంటే సీనియర్ దర్శకులను మాస్ కాంబినేషన్స్ ను నమ్మి ట్రాక్ తప్పుతున్నట్లు అనిపిస్తోంది. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన ‘ఎఫ్ 2’ (F2) దిల్ రాజు కెరీర్‌లో ఒక పెద్ద విజయాన్ని అందించింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ పెట్టిన పెట్టుబడికి ఊహించని లాభాలను తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి.
‘జాను’ (Jaanu) , ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) , ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) , ‘థాంక్యూ’ (Thank You) వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. వీటిలో ‘వకీల్ సాబ్’ మాత్రమే ఒక మోస్తరుగా ఆడినా, థియేట్రికల్ పరంగా అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదు. ‘ఎఫ్ 3’ (F3) సినిమాతో దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడినా అందులో కూడా ఎక్కువగా ప్రాఫిట్స్ రాలేదు. ఇక ఈమధ్య వచ్చిన ‘వారిసు’ (Varisu), ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రాలు పెద్దగా పేలలేదు. ముఖ్యంగా ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం అత్యంత డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాణం, ఆయన స్టోరీ సెలక్షన్ ట్రాక్ మిస్సవుతోందనేల కామెంట్స్ వస్తున్నాయి. దిల్ రాజు తన సొంత బ్యానర్‌నే కాకుండా, ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ తో కలిసి ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ పేరుతో మరికొన్ని చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో వచ్చిన ‘బలగం’ (Balagam) మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘లవ్ మీ’ (Love Me) మరియు ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.
ప్రస్తుతం దిల్ రాజు హోప్స్ అన్నీ ‘గేమ్ చేంజర్’ (Game changer) మీదే ఉన్నాయి. కానీ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప సేఫ్ కాలేని పరిస్థితి. మరోవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అనిల్ ట్రాక్ రికార్డ్ పట్ల దిల్ రాజు భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం జడ్జ్‌మెంట్ లో చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న దిల్ రాజు ఈ సినిమాలతో అయినా ట్రాక్‌లోకి వస్తారేమో చూడాలి.