RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’ దిల్‌ రాజుకి అంత లాభం తెచ్చిపెట్టిందా!

ఇండస్ట్రీలో దిల్‌ రాజు ప్లానింగ్‌ గురించి అందరూ గొప్పగా చెబుతుంటారు. సినిమా నిర్మించడంలోనే కాదు, ఇతరుల సినిమాలు విడుదల చేసే విషయంలో ఆయన పక్కా ప్లానింగ్‌లో ఉంటారు. అయితే ఒకటి రెండు సినిమాల విషయంలో మిస్‌ ఫైర్‌ అవుతూ ఉంటుంది. కానీ ప్లానింగ్‌ పక్కాగా అమలు అయినప్పుడు ఆ సినిమా వసూళ్లు అదిరిపోతాయి అంటుంటారు. అలా దిల్‌ రాజు రీసెంట్‌ హిట్‌ ప్లాన్‌ ‘ఆర్ఆర్ఆర్‌’ అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమాను నైజాం ఏరియాలో దిల్‌ రాజు విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు మంచి టాక్‌ రావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి సినిమా చూశారు. దీంతో మంచి వసూళ్లే దక్కాయి. ఇప్పటివరకు అందుతున్న లెక్కల ప్రకారం చూస్తే… నైజాంలో ‘ఆర్ఆర్ఆర్‌’ రూ. వంద కోట్లు వసూలు సాధించిందని అంటున్నారు. గతంలో వచ్చిన వివరాల ప్రకారం చూస్తే.. ఈ సినిమా రిలీజ్‌ హక్కుల కోసం దిల్‌ రాజు రూ. 70 కోట్ల నుండి రూ. 80 కోట్లు పెట్టారని చెప్పొచ్చు. లేట్‌ వడ్డీలు చూస్తే రూ. 10 కోట్ల నుండి రూ. 15 కోట్ల వరకు ఉంటాయి.

ఈ లెక్కన ఆయన సినిమాకు రూ. 80 కోట్ల నుండి రూ. 95 కోట్ల వరకు పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు వసూళ్ల ఫ్లో చూస్తే పెట్టింది వచ్చేసింది. ఇక ఎంత వచ్చినా లాభమే అని చెప్పొచ్చు. సినిమా రెండు వారాలు పూర్తవడంతో టికెట్‌ రేట్లు తగ్గాయి. దీంతో రిపీట్ ఆడియన్స్‌, ఫ్యామిలీస్‌ థియేటర్లకు వస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మరో వారం పాటు ‘ఆర్ఆర్‌ఆర్‌’ సందడి ఉండబోతోంది. దీంతో దిల్‌ రాజుకు మరో రూ. 10 కోట్ల నుండి రూ. 15 కోట్లు రావొచ్చు అని చెబుతన్నారు.

దీంతో దిల్‌ రాజు ‘ఆర్ఆర్ఆర్‌’ ద్వారా సుమారు రూ. 20 కోట్లు లాభం వచ్చిందని లెక్కలేస్తున్నారు. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియదు కానీ.. స్ట్రయిట్‌ సినిమా తీసినా ఇంత పక్కా లాభం కనిపించదు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ఆనందంతోనే దిల్‌ రాజు ఇటీవల ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌కి పార్టీ ఇచ్చారని టాక్‌. ఇక రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.900 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ జోరు ఏప్రిల్‌ 13వరకు కొనసాగితే వసూళ్లు ఇంకా పెరుగుతాయి. ఆ తర్వాత ‘బీస్ట్‌’, ‘కేజీయఫ్‌ 2’ వచ్చేస్తాయి కాబట్టి. ఇక వాటి సందడి షురూ అవుతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus