Dil Raju: దిల్ రాజు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినట్టేనా?

సాధారణంగా సినిమా ప్రేక్షకులలో చాలామందికి సినిమా నిర్మాతల గురించి పెద్దగా అవగాహన ఉండదు. అయితే ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన సినిమా అంటే ఆ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడతాయి. పరిమిత బడ్జెట్ తో క్వాలిటీ సినిమాలను తెరకెక్కించి ఎక్కువగా విజయాలను అందుకున్న నిర్మాతగా దిల్ రాజుకు పేరుంది.

Click Here To Watch NOW

ఒకవైపు నిర్మాతగా మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా రెండు పడవల ప్రయాణం చేస్తున్న దిల్ రాజు ఈ ఏడాది రిలీజైన పెద్ద సినిమాలైన భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల హక్కులను కొనుగోలు చేశారు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా దిల్ రాజుకు స్వల్పంగా లాభాలు వచ్చాయి. భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమా రీమేక్ కావడంతో అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ హక్కులను దిల్ రాజు భారీ మొత్తానికి కొనుగోలు చేయగా ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. దిల్ రాజుకు ఈ సినిమా ద్వారా 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా నష్టాలు వచ్చాయని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అయితే రాధేశ్యామ్ తో వచ్చిన నష్టాలు ఆర్ఆర్ఆర్ తో దిల్ రాజుకు రికవరీ అయ్యాయని సమాచారం. నైజాంలో ఆర్ఆర్ఆర్ కు ఇప్పటికే 77 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా ఈ ఏరియాలో మరో 14 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం సాధించే ఛాన్స్ ఉంది. నైజాంలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో దిల్ రాజు పంట పండిందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus