Dil Raju: క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్!

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా చెలామణి అవుతోన్న దిల్ రాజు ఇప్పుడు తన పాన్ ఇండియా లెవెల్ లో తన ప్రొడక్షన్ హౌస్ ను విస్తరిస్తున్నాడు. ‘జెర్సీ’ రీమేక్ తో బాలీవుడ్ లో నిర్మాతగా ఎంటర్ అవుతోన్న దిల్ రాజు.. ఇటీవలే రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. మరోపక్క ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఈయన బ్యానర్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాతో పాటు మరో సినిమా చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఈ మేరకు విజయ్, ప్రశాంత్ లతో సంప్రదింపులు జరుపుతున్నాడని.. ఇద్దరూ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పట్టడం ఖాయం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తరువాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఆపై బన్నీ, ప్రభాస్ లకు కమిట్మెంట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే కానీ విజయ్ తో సినిమా మొదలుపెట్టడం కుదరదు. ఈ కాంబినేషన్ లో సినిమా ఆలస్యమైనా.. సినిమా మాత్రం పక్కా ఉంటుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై దిల్ రాజు స్పందిస్తాడేమో చూడాలి!

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus