ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబుతో కుదిరింది…. ఇన్నాళ్లకు విజయ్ తో చేసే అవకాశం వచ్చింది: దిల్ రాజు

దళపతి విజయ్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం వారసుడు. ఈ సినిమా తమిళంలో వరిసు అనే పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో జనవరి 11వ తేదీ విడుదల కాక తెలుగులో ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల అద్భుతమైన విషయాన్ని అందుకుంది. ఇలా తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి సెక్స్ అందుకోవడంతో చిత్ర బంధం థాంక్స్ గివింగ్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

చెన్నైలో సోమవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే దిల్ రాజు మాట్లాడుతూ తనకు విజయ్ నటించిన సినిమాలు చాలా ఇష్టమని ఈ మధ్యకాలంలో ఈయన కమర్షియల్ ఫార్మేట్ సినిమాలు చేస్తున్నారని తెలిపారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలో ఆయనతో కలిసి బృందావనం వంటి ఫ్యామిలీ సినిమా చేశాను .

అదేవిధంగా ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్, మహేష్ బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు చేశాను.ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ నేపథ్యంలో వచ్చే సినిమాలు హీరో విజయ్ తో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇలా వారసుడు రూపంలో హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశం లభించిందని,

ఇన్ని సంవత్సరాలకు నా కోరిక నెరవేరింది అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు హీరో విజయ్ గురించి ఈ కార్యక్రమంలో చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus