వకీల్ సాబ్ విషయంలో దిల్ రాజు ఆలోచన అదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. దీనితో ఆయన తన ఫార్మ్ హౌస్ లో ఉంటూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. దీక్షలో భాగంగా, శాఖాహారం, చన్నీళ్ల స్నానం, నేలపై పడక, ఒంటి పూట భోజనం వంటి అనేక కఠిన నియమాలు పాటిస్తున్నారు. ఇక జుట్టు, గడ్డం కూడా పవన్ విపరీతంగా పెంచేశారు. కాగా పవన్ నిర్మాతలు దీక్ష విరమణ కోసం ఎదురుచూస్తున్నారట. టాలీవుడ్ లో షూటింగ్స్ మొదలుకానుండగా పవన్ కూడా సంసిద్ధం కావాల్సి ఉంది.

నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ వాటిని వచ్చే రెండుమూడేళ్ళలో పూర్తి చేయాల్సి ఉంది. మరో వైపు నిర్మాత దిల్ రాజు పవన్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఆయన దీక్ష విరమిస్తే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తున్న నేపథ్యంలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాలనేది దిల్ రాజు ఆలోచనట.

ఇక పవన్ చాతుర్మాస్య దీక్ష కార్తీక మాసంతో ముగియనుంది. అప్పటి వరకు దిల్ రాజు ఎదురుచూడక తప్పదు. ఓటిటి సంస్థల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుండగా, సినిమా పూర్తయితే థియేటర్స్ లేదా ఓటిటి విడుదల ద్వారా క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు చూస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus