Dil Raju: చరణ్‌- శంకర్‌ సినిమాకు దిల్‌ రాజు లెక్క ఇదీ

దిల్‌ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం చరణ్‌ – శంకర్‌ కాంబో. తన బ్యానర్‌లో 50వ సినిమా కావడంతో దిల్‌ రాజు ఈ సినిమా కోసం గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి హీరో, దర్శకుడు ఓకే అయిపోవడంతో చిత్రబృందం ఎంపిక పనుల్లో ఉన్నాడట. హీరోయిన్‌ ఆమె, ఈమె అంటూ వార్తలొస్తున్నాయి. టెక్నికల్‌ టీమ్‌ విషయంలోనూ ఇలానే మాటలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా శంకర్‌, చరణ్‌ పారితోషికాలు ఇవే అంటూ ఓ వార్త కనిపిస్తోంది.

ఈ సినిమా కోసం దిల్‌ రాజు ₹150 కోట్లు బడ్జెట్‌గా పెట్టుకున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ విషయం అధికారికంగా ప్రకటించనప్పటికీ అంతే పెడుతున్నాడనే వార్తలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో పూర్తి లెక్కలు ఇవనేది తాజా వార్త. మొత్తం ₹150 కోట్లలో చరణ్‌, శంకర్‌కు చెరో ₹40-₹50 కోట్లు ఇస్తున్నారట. అంటే వీరిద్దరికే ₹80-₹100 కోట్లు అయిపోయాయి. మిగిలింది ₹50-₹70 కోట్లే. దీంతోనే మిగిలిన పనులన్నీ చూసుకోవాలి. మిగిలిన టీమ్‌కి డబ్బులు ఇవ్వాలి.

ఈ లెక్క చూస్తుంటే అయితే దిల్‌ రాజు బడ్జెట్‌ పెరుగుతుంది, లేదంటే హీరో – డైరక్టర్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్‌ తగ్గుతుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే ప్రస్తుతం లెక్కల ప్రకారం అంత పెద్ద సినిమాను ₹50-₹70 కోట్ల మధ్య పూర్తి చేయడం, ప్రచారం చేయడం కష్టమే మరి. అయితే పెట్టింది మొత్తం రిలీజ్‌ముందే వెనక్కి వచ్చేలా దిల్‌ రాజు ఎలాగూ ప్లాన్‌ చేసుకుంటాడు అనుకోండి. చూద్దాం ఈ లెక్కల విషయంలో ఇంకెన్ని లీక్‌లు వస్తాయో.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus