ఎఫ్3 షూటింగ్ స్టార్ట్ చేయాలంటే దిల్ రాజు ప్లాం వర్కవుటవ్వాలి

అప్పటివరకు వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న దిల్ రాజుకు సూపర్ హిట్ ఇవ్వడమే కాక.. హిందీ రీమేక్ అని, బెస్ట్ ఇండియన్ పనోరమా అవార్డు వంటివి సాధించి దిల్ రాజు బ్రాండ్ ఇమేజ్ ను అమాంతం పెంచేసిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమాతో వెంకటేష్, వరుణ్ తేజ్ లకు కూడా విశేషమైన మైలేజ్ వచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఏకంగా మహేష్ బాబుతో సినిమా తీయగలిగాడు అంటే దానికి కారణం కూడా ఈ సినిమా సాధించిన విజయమే.

ఇంత మందికి ఇన్ని రకాలుగా ఉపయోగపడిన “ఎఫ్ 2” చిత్రానికి సీక్వెల్ గా రూపొందనున్న “ఎఫ్ 3” అసలు ఈపాటికి సెట్స్ మీదకు వెళ్ళిపోవాలి. అయితే.. కరోనా కారణంగా కొన్నాళ్ళు, ఇప్పుడు ఆర్టిస్టుల పేమెంట్ సెటిల్ మెంట్స్ కారణంగా మరికొన్నాళ్లు లేట్ అవుతూ వస్తోంది. ఆల్రెడీ తెలుగు అగ్ర నిర్మాణ సంస్థలు తమ చిత్రాల షూటింగ్స్ మొదలెట్టేశాయి. కొన్ని ఎనౌన్స్ మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. కానీ.. అగ్ర నిర్మాతల్లో ప్రముఖుడైన దిల్ రాజు బ్యానర్ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లాంఛనంగా ప్రారంభం కాకపోవడం గమనార్హమైన విషయంగా మారింది.

దాంతో “ఎఫ్ 3″ని కాస్త సీరియస్ గా తీసుకున్న దిల్ రాజు.. రెమ్యునరేషన్ విషయంలో బెట్టు చేస్తున్న వరుణ్ తేజ్ & వెంకటేష్ లకు తన బ్యానర్ లో మరో సినిమా ఆఫర్ చేయడంతోపాటు.. వారి తదుపరి చిత్రాలను తానే డిస్ట్రిబ్యూట్ చేస్తానని షరతుకు ఒప్పించాడు. దిల్ రాజు రంగంలోకి దిగి.. ప్రామిస్ చేసేసరికి ఇద్దరు హీరోలు సరేనన్నారు. త్వరలోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. తమన్నా, మెహరీన్ లు కథానాయికలుగా నటించనున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus