Arya 3: మళ్లీ ముందుకొచ్చిన ‘ఆర్య 3’.. సుకుమార్‌ ప్లానింగేంటి? ఏం చేస్తారో?

తెలుగు సినిమాలో సీక్వెల్స్‌ ఇప్పుడంటే హిట్‌ ఫార్ములా అవుతున్నట్లు కనిపిస్తోంది కానీ.. గతంలో ఈ ఆప్షన్‌ ఫ్లాప్‌, డిజాస్టర్‌లానే ఉండేది. చాలా సినిమాలు ఈ తరహా ప్రయత్నం చేసినా సరైన విజయం అందుకోలేదు. అలాంటి వాటిలో ‘ఆర్య’ (Aarya) ఒకటి. ‘ఆర్య’ సినిమా ఎంతటి భారీ విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకు సీక్వెల్‌గా ఆ పేరును తీసుకొని చేసిన చిత్రం ‘ఆర్య 2’ (Arya 2). ఈ సినిమా ఇబ్బందికర ఫలితాన్ని అందుకుంది.

Arya 3

ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకనుకుంటున్నారా? దానికి సీక్వెల్‌ ఆలోచన జరుగుతోంది కాబట్టి. అవును, మీరు చదివింది నిజమే. మూడోసారి ‘ఆర్య’ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju). హీరోగా అల్లు అర్జున్‌ని (Allu Arjun), ద‌ర్శ‌కుడిగా సుకుమార్ (Sukumar) కెరీర్‌ని సెట్ చేసిన సినిమా కావడంతో.. ఇప్పుడు సీక్వెల్‌ మీద మరోసారి ఆసక్తి రేకెత్తింది. తాజాగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో ‘ఆర్య 3’ (Arya 3) అనే టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్ట‌ర్ చేయించారని సమాచారం.

త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేస్తారు అని తెలుస్తోంది. అప్పుడు కాస్ట్‌ అండ్‌ క్రూ వివరాలు కూడా చెప్పే అవకాశం ఉంది అని అంటున్నారు. సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లోనే కదా ఈ సినిమా వస్తుంది. కొత్తగా ఇప్పుడు కాస్ట్‌ అండ్‌ క్రూ గురించి చెప్పడం ఏంటి అనే డౌట్‌ వస్తోందా? ఇలా అనడానికి కారణం ఉంది.. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇద్దరూ కలసి సినిమా చేసే అవకాశం లేదు.

ఇద్దరి ఇమేజ్‌లు ఇప్పుడు ‘ఆర్య’ లాంటి లవ్‌ స్టోరీ చేసే సైజ్‌లో లేదు. కాబట్టి ‘ఆర్య 3’ ఈ ఇద్దరూ చేయకపోవచ్చు అని అంటున్నారు. దానికి తోడు ఇద్దరికీ అంత టైమ్‌ లేదు. దీంతో సుకుమార్ క‌థతో తన అసిస్టెంట్‌ ఈ సినిమా చేస్తారు అంటున్నారు. ఇక హీరో విషయానికొస్తే యంగ్‌ హీరోను ఒకరిని తీసుకొద్దామని చూస్తున్నారట. అయితే ఆ హీరో సొంత ఇంటి నుండే వచ్చే అవకాశం కూడా ఉంది అని చెబుతున్నారు. త్వరలో క్లారిటీ వస్తుంది.

నాగార్జునతో మందు.. వెంకటేష్‌తో చిందు.. సుమంత్ కామెంట్స్‌ వైరల్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus