Dil Raju: ‘రౌడీ బాయ్స్’ సినిమా ఆ హద్దులన్నీ దాటిందట..!

దిల్ రాజు సినిమాలు చాలా వరకు ఫ్యామిలీ ఎంటెర్టైనెర్లే..! ఒకవేళ ‘కొత్త బంగారు లోకం’ ‘జోష్’ ‘కేరింత’ వంటి యూత్ ఫుల్ సినిమాల్ని తీసుకున్నా.. అందులో కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యి అలరించే అంశాలు ఎన్నో ఉంటాయి. హద్దులు మీరిన గ్లామర్ షోని దిల్ రాజు ఎంకరేజ్ చేయడు. ‘నా సినిమాల్లో కూడా లిప్ లాక్ లు వంటివి ఉండాలేమో’ అని దిల్ రాజు ఓ సందర్భంలో అంటే ‘రాజు గారు కామెడీ చేస్తున్నారు’ అనే అనుకున్నారు అంతా..!

ఫ్యామిలీ ఆడియెన్స్ లో దిల్ రాజు సినిమా అంటే మంచి క్రేజ్ ఉంది. అదీ సంక్రాంతికి ఆయన బ్యానర్ నుండీ ఓ సినిమా వస్తుంది అంటే.. వాటిలో చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అనేది అందరి బలమైన నమ్మకం. అయితే ఈసారి ఆయన సినిమా చాలా హద్దులు దాటిందట. అదే ‘రౌడీ బాయ్స్’ చిత్రం. దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశీష్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

హీరో మాత్రమే కొత్త. సినిమాకి పనిచేసిన వాళ్లంతా సీరియర్లు, స్టార్లు. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ” ఈనెల 14న మా ‘రౌడీ బాయ్స్’ రిలీజ్ అవుతుంది. సంక్రాంతి సీజ‌న్‌ కు మా సినిమాలు 5 వచ్చాయి. అన్నీ సూపర్ హిట్లే..!‘రౌడీ బాయ్స్‌’తో డ‌బుల్ హ్యాట్రిక్ కొడ‌తాం అనే న‌మ్మ‌కం ఉంది. ఇది ఒక యూత్ ఫుల్ మూవీ. 15 ఏళ్ల నుండీ 25 ఏళ్ల‌లోపు యువ‌త‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

మా సినిమాల‌న్నీ చాలా ప‌ద్ద‌తిగా ఉంటాయి. కానీ మొదటిసారి మా సినిమా చూసి సెన్సార్ వాళ్లు కూడా షాక్ అయ్యారు. ఏంటండీ ఇది ‘ఇది మీ సినిమానేనా ‘అన్నారు. మా అబ్బాయి ఆశిష్ కోసం మొదటిసారి హద్దులు దాటాల్సి వచ్చింది“ అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. అనుపమతో మొదటి సారి లిప్ లాక్ పెట్టించినప్పుడే ఈ విషయం పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు దిల్ రాజు డైరెక్ట్ గానే కన్ఫర్మ్ చేశారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus