దిల్ రాజు ప్లాన్ అప్పుడు వర్కౌట్ అయ్యింది కానీ.. ఇప్పుడు వర్కౌట్ కాలేదు..!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. అతను ఏ జోనర్ సినిమా నిర్మించినా సరే అది సూపర్ సక్సెస్ సాధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఫలితం తేడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అనుకోండి. ఇది పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో సినిమాకు టైటిల్ పెట్టడం అనేది పెద్ద కష్టమైన పనైపోయింది దర్శక నిర్మాతలకి..! స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసినా.. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసినా.. ఆ సినిమాకి టైటిల్ పెట్టడం అనేది పెద్ద తలనొప్పిగా మారింది.

ముందుగా ఓ మంచి టైటిల్ అనుకోవాలి.. అది హీరో ఫ్యాన్స్ కు నచ్చేలా ఉండాలి అలాగే సినిమాకి హైప్ పెంచేలా కూడా ఉండాలి. అన్నిటికంటే ముందు ఆ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకోవాలి. లేదంటే ఎన్ని వివాదాలు అవుతాయో మనం ‘మహేష్ ఖలేజా’ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాల విషయంలో చూసాం. అయితే దిల్ రాజు వంటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కు ఓ టైటిల్ తీసుకోవడం చాలా ఈజీ. సరైన టైటిల్ దొరకని టైంలో ఏకంగా.. మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల టైటిల్స్ నే వాడేసుకున్నాడు. కొంచెం గతంలోకి వెళ్తే.. మహేష్ బాబు- సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే సినిమా చేయాలనుకున్నారు.

టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు.ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాంతో ప్రభాస్ – దశరథ్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిచిన సినిమాకి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే టైటిల్ ను అడిగి పెట్టుకున్నారు. అందుకు దిల్ రాజు మహేష్ సినిమా యూనిట్ కు థాంక్స్ కూడా చెప్పారు. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇదే ఏడాది దిల్ రాజు నిర్మించిన ’96’ రీమేక్ ‘జాను’ టైటిల్ కూడా ‘ప్రభాస్ 20’ టైటిల్ అన్న సంగతి తెలిసిందే. వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగి మరీ ఈ టైటిల్ ను తీసుకున్నారు దిల్ రాజు. ఈసారి కూడా ‘ప్రభాస్ 20’ టీం కు థాంక్స్ చెప్పారు. అయితే ఈసారి మాత్రం సినిమా ప్లాప్ అయ్యింది.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus