Dilraju: ‘బలగం’ రేంజి పేరు, డబ్బు తెచ్చుకునేలా దిల్‌ రాజు మరో ప్లాన్‌… ఈసారి?

నిర్మాతకు ఓ సినిమా నుండి వచ్చే డబ్బులు ఎక్కువ సంతృప్తినిస్తాయా? లేక ప్రశంసలు, పురస్కారాలు ఎక్కువ సంతృప్తినిస్తాయా? అంటే రకరకాల చర్చలు వస్తాయి. కొంతమంది ఇది, కొంతమంది అది అనొచ్చు. అయితే ఈ రెండూ కలసి వచ్చినప్పుడే ఎక్కువ ఆనందం అని చెప్పాలి. ఇప్పుడు ఇంచుమించు అలాంటి ఆనందంలోనే ఉన్నారు దిల్‌ రాజు. తన వారసుల్ని ముందు పెట్టి ఆయన రూపొందించిన చిత్రం ‘బలగం’. కమెడియన్‌ వేణు దర్శకత్వంలో ఈ సినిమా రూపొంది మంచి విజయం అందుకుంది.

తెలంగాణ పల్లెల్లో ఆ సినిమా ఇప్పుడు ఒక ఎమోషన్‌గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమాకు 30కిపైగా పురస్కారాలు వచ్చాయి అని చెబుతున్నారు. అంతలా ఈ సినిమా ఇంపాక్ట్‌ ఉంది. ఇక ఊళ్లలో అయితే సినిమాను చూసి జనాలు కంటతడి పెట్టుకుంటున్నారు. ఎప్పుడో మనస్పర్థలతో దూరమైన వాళ్లు ఇప్పుడు మళ్లీ కలుస్తున్నారు కూడా. ఇలాంటి ఇంపాక్ట్‌ ఉన్న సినిమాను మళ్లీ చేయాలని దిల్‌ రాజు అనుకున్నారు. ఈ మేరకు ఓ సినిమా తుది దశలో ఉంది అని కూడా చెబుతున్నారు.

ఓవైపు పెద్ద సినిమాలు నిర్మిస్తూ, మరో చిన్న సినిమాల కోసం (Dilraju) దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ అనే బ్యానర్‌ పెట్టారు దిల్‌ రాజు. తన కూతురు హన్షిత, అన్న కొడుకు హర్షిత్‌ ఈ బ్యానర్‌ పనులు చూస్తున్నారు. అందులో భాగంగా తొలుత ‘బలగం’ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు అదే బ్యానర్‌లో మరో సినిమా సిద్ధమవుతోంది. డ్యాన్స్ మాస్టర్ యశ్ హీరోగా, శశి అనే రైటర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నారట దిల్ రాజు.

రోడ్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అని సమాచారం. ‘బలగం’లో విలేజ్‌ లైఫ్‌, పాత్రలను చూపిస్తే.. ఇప్పుడు ఈ సినిమాలో సిటీ లైఫ్‌, మెకానికల్‌ జీవితాలను చూపిస్తారట. సినిమా దాదాపు పూర్తయిపోయిందని, త్వరలో మంచి డేట్‌ చూసి సినిమా విడుదల చేస్తారని సమాచారం. ‘బలగం’ సినిమా తరహాలో ఈ సినిమాను కూడా స్పెషల్‌ షోస్‌ వేసి ప్రేక్షకుల్లోకి భారీగా తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారట.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus