Vijay, Ajith: పొంగల్ విన్నర్ విజయా..? అజితా.. ఫైనల్ లెక్క ఏంటి

‘వరిసు'( తెలుగులో ‘వారసుడు’) సినిమా వల్ల కెరీర్లో ఎన్నడూ లేని ట్రోలింగ్ ను ఫేస్ చేశాడు దిల్ రాజు.చిరంజీవి, బాలకృష్ణ వంటి .. ఇద్దరు బడా స్టార్ హీరోలు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ డబ్బింగ్ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. గతంలో ‘ఎఫ్2’ టైంలో ‘పేట’ అనే డబ్బింగ్ చిత్రానికి ఎక్కువ థియేటర్లు ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించిన దిల్ రాజు..

ఈసారి తన నిర్మాణంలో రూపొందిన వారసుడు అనే డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయించుకున్నాడు అంటూ అంతా విరుచుకుపడ్డారు. ఈ విషయాల పై పెద్ద చర్చలు జరిగాయి. ఫైనల్ గా సంక్రాంతికి తన సినిమాని 3 రోజులు ఆలస్యంగా విడుదల చేసి కొంత కాంప్రమైజ్ అయ్యాడు. అయితే తమిళంలో కూడా దిల్ రాజు పై కొంత నెగిటివిటీ ఏర్పడింది. ఎందుకంటే అక్కడ అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని.. ‘వరిసు’ తో సమానంగా ‘తునీవు'(తెగింపు’) కి ఎక్కువ థియేటర్లు ఎలా ఇస్తారంటూ..

కామెంట్లు చేసి ట్రోల్ అయ్యాడు. అయితే ఫైనల్ గా దిల్ రాజు చెప్పిందే నిజమయ్యింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ‘తెగింపు’ చిత్రం మొదటివారం పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.149.66 కోట్ల(గ్రాస్) కలెక్షన్లు రాబట్టగా.. ‘వరిసు’ చిత్రం మొదటివారం పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.213.50 కోట్ల(గ్రాస్) కలెక్షన్లను రాబట్టింది. దీంతో ‘దిల్ రాజు చెప్పింది నిజమే అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఇక్కడో చిన్న విషయాన్ని గమనించాలి. అదేంటి అంటే.. ‘తునీవు’ కి ప్లాప్ టాక్ వచ్చినా రూ.149.66 కోట్ల వసూళ్లను రాబట్టింది. షేర్ పరంగా రూ.77.88 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.8 కోట్లు వస్తే సరిపోతుంది. అయితే ‘వారసుడు’ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో రూ.213.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. షేర్ పరంగా రూ.109 కోట్లు. కానీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఏకంగా రూ.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus