Dimple Hayathi: అభిమానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన డింపుల్ హయాతి..!

డింపుల్ హయాతి.. అందరికీ సుపరిచితమే. గల్ఫ్, గద్దలకొండ గణేష్, యురేక వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ.. రవితేజకి జోడీగా ఖిలాడి అనే సినిమాలో కూడా నటించింది. అవి పెద్దగా ఆడలేదు. అయితే గోపీచంద్ కు జోడీగా ఈమె రామబాణం సినిమాలో కూడా నటించింది. మే 5 న ఈ సినిమా విడుదల కాబోతోంది. రామబాణం ప్రమోషన్స్ లో హీరోయిన్ డింపుల్ హయాతిని.. ఓ అభిమాని వింత ప్రశ్న అడిగాడు.

అతను మాట్లాడుతూ..’మీరు నాకు ఓ విషయంలో పరిమిషన్ ఇస్తారా?’ అని అడిగాడు. దీనికి హయతి.. ‘ఏంటో చెప్పండి’ అని అనడంతో.. ఆ అభిమాని ‘ నేను మీకు గుడి కట్టాలని అనుకుంటున్నా.. అది పాల రాయితో కట్టాలా? ఇటుకలతో కట్టాలా?’ అని ప్రశ్నించాడు. దీనికి డింపుల్ హయాతి సమాధానం ఇస్తూ.. ‘నాకు బంగారంతో గుడి కట్టండి చాలా బాగుంటుంది ‘ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో ఆ అభిమాని షాక్ అయ్యాడు.

పక్కనున్న వాళ్ళు గట్టిగా నవ్వారు. మరో అభిమాని.. ఈ మధ్య మీకు సంబంధించిన ఎన్నో న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..’ మీపై వచ్చే ట్రోల్స్ ను ఎలా తీసుకుంటారు?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి (Dimple Hayathi) డింపుల్ హయాతీ రియక్ట్ అవుతూ.. ‘మొదట్లో నాకు ట్రోల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు.. కానీ ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

అనుకునే వాళ్ళు అనుకున్నంత అంటూ వదిలేస్తున్నాను. ఒక పరిధి దాటనంత వరకు ట్రోల్స్ ఫన్నీగా.. ఇష్టంగానే ఉంటాయి. ఒకవేళ అవి హద్దులు దాటితే పరిస్థితి వేరుగా ఉంటుంది.. ఎందుకంటే మేం కూడా మనుషులమే కదా’ అంటూ కూల్ గా సమాధానం ఇచ్చింది డింపుల్.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus