Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

కొన్నాళ్ల క్రితం ఓ ఐపీఎస్ అధికారితో పార్కింగ్ విషయంలో గొడవ పెట్టుకుని నానా యాగీ చేసిన డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆ తర్వాత బాగా సైలెంట్ అయిపోయింది. ఏవో ట్రిప్పులు, కొన్ని ఫోటోషూట్స్ తో బిజీగా ఉండడం మొదలుపెట్టింది. ఆమె నటించిన “రామబాణం” విడుదలైన తర్వాత మరో ఆఫర్ చేజిక్కించుకోవడానికి దాదాపు ఏడాది పైనే పట్టింది అమ్మడికి. అందుకు కారణం ఆ సినిమా రిజల్ట్ కూడా అనుకోండి.

Dimple Hayathi

చాన్నాళ్ల తర్వాత రీసెంట్ గా శర్వాండ్ సరసన “భోగి” అనే సినిమా సైన్ చేసింది డింపుల్. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవ్వనుంది. అమ్మాయి మళ్లీ బిజీ అవుతుంది అనుకుంటున్న తరుణంలో.. డింపుల్ మరో వివాదంలో చిక్కుకుంది. జర్నలిస్ట్ కాలనీలో ఉండే డింపుల్ ఆ గొడవ అనంతరం ఇల్లు మారి షేక్ పేట దగ్గరలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అనే అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యింది.

రీసెంట్ గా తన ఇంట్లో కుక్కల్ని చూసుకోవడానికి ఇద్దరు అమ్మాయిలను పనిమనుషులుగా పెట్టుకుందట డింపుల్. అయితే.. ఆ అమ్మాయిలను కుదిర్చిన ఒకావిడ ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. డింపుల్ ఆ అమ్మాయిలను చాలా ఇబ్బందిపెట్టిందని, అతని భర్త అనరాని మాటలు అన్నాడని అ వీడియోలో పేర్కొంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమ్మాయిల విషయం అనేది కాసేపు పక్కన పెడితే.. డింపుల్ భర్త లాయర్ అని సదరు మహిళ పేర్కొనడం ఇక్కడ చర్చనీయాంశం అయ్యింది. అసలు డింపుల్ కి పెళ్లి ఎప్పడు అయ్యింది? ఆమెతో పాటు ఉంటున్నది ఎవరు? వంటి ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ వివాదం నుంచి డింపుల్ ఎలా బయటపడుతుంది అనేది చూడాలి.

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus