Dimple Hayathi: ఆ పాట కోసం 6 కిలోలు తగ్గానన్న డింపుల్ హయాతి.. గ్రేట్ అంటూ?

అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకపోవడం వల్ల కెరీర్ విషయంలో డింపుల్ హయాతి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా ఆశించిన స్థాయిలో ఆఫర్లు అయితే రావడం లేదు. ఖిలాడీ, రామబాణం సినిమాలలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం. అయితే రామబాణం ప్రమోషన్స్ లో భాగంగా డింపుల్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. నేను విజయవాడలో పుట్టినా హైదరాబాద్ లో పెరిగానని ఆమె అన్నారు.

అమ్మ, నాన్న బిజినెస్ లతో బిజీగా ఉండేవారని చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనేది నా కల అని డింపుల్ అన్నారు. ఏ సినిమా చూసినా ఆ సినిమాలోని డైలాగ్ లను రిహార్సల్ చేసేదానినని ఆమె కామెంట్లు చేశారు. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడానికి నాలో నేను మాట్లాడుకోవడంతో తాతయ్య భయపడి నాకు తాయత్తు కట్టించారని డింపుల్ పేర్కొన్నారు. నేను టామ్ బాయ్ లా పెరిగానని పాఠశాలలో అబ్బాయిలతో గొడవ పడ్డానని, పరీక్ష పేపర్లను దొంగలించిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

కొరియన్ సినిమాలు ఎక్కువగా చూస్తానని ఖాళీ సమయంలో వర్కౌట్లు చేస్తానని డింపుల్ వెల్లడించారు. నేను క్లాసికల్ డ్యాన్సర్ అని ఫాంటసీ సినిమాలలో నటించాలని నాకు కోరిక ఉందని డింపుల్ హయాతి వెల్లడించడం గమనార్హం. గద్దలకొండ గణేష్ సినిమాలోని సాంగ్ నా జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె అన్నారు. గ్లామర్ పాత్రలకు సెట్ కానని, రంగు తక్కువున్నానని కొంతమంది దర్శకులు నన్ను తిరస్కరించారని డింపుల్ హయాతి పేర్కొన్నారు.

ఖిలాడి మూవీనిలోని క్యాచ్ మి సాంగ్ కోసం ఏకంగా 6 కిలోల బరువు తగ్గానని (Dimple Hayathi) ఆమె చెప్పుకొచ్చారు. డింపుల్ హయాతి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డింపుల్ హయాతికి రాబోయే రోజుల్లో వరుస విజయాలు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus