Anil Ravipudi, Thaman: భగవంత్ రీ రికార్డింగ్ చూసి అలా ఫీలయ్యా.. అనిల్ కామెంట్స్ వైరల్!

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కొన్నిరోజుల క్రితం థమన్ పై బోయపాటి శ్రీను విమర్శలు చేయగా ఆ విమర్శలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి. బోయపాటి థమన్ గురించి ఇలా కామెంట్లు చేయడం ఏంటని ఫ్యాన్స్ ఫీలయ్యారు. భవిష్యత్తులో బోయపాటి శ్రీను థమన్ కాంబినేషన్ లో సినిమాలు కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు బాలయ్య సినిమాలకు వరుసగా పని చేస్తున్న థమన్ భగవంత్ కేసరి సినిమా విషయంలో ప్రశంసలు అందుకుంటుండగా అనిల్ రావిపూడి థమన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ టెక్నీషియన్ అయినా సినిమా కంటెంట్ ఆధారంగా పని చేస్తాడని అనిల్ రావిపూడి తెలిపారు. సినిమా చెడగొట్టాలని ఎవరూ పని చేయరని ఆయన అన్నారు. ఒక్కోసారి కంటెంట్ కనెక్ట్ అయ్యి అద్భుతంగా కొట్టొచ్చని మరోసారి యావరేజ్ మ్యూజిక్ కొట్టవచ్చని అనిల్ రావిపూడి తెలిపారు.

కామెంట్ చేయడం సులువు అని క్రియేటివిటీ కష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. (Thaman) థమన్ బాగా కొడతానని తనకు వదిలేయాలని మాటిచ్చాడని రీరికార్డింగ్ తర్వాత చూసి థమన్ ను హగ్ చేసుకుని బయటకు వస్తున్నానని అనిల్ తెలిపారు. అద్భుతమైన పాట కావాలంటే ఎదురుచూడక తప్పదని నేను అలాగే ఎదురుచూశానని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. మిగతా వాళ్ల ఫిర్యాదుల గురించి నాకు తెలియదని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.

భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి మరో రెండు సాంగ్స్ రిలీజ్ చేయలేదని ఆ సాంగ్స్ లో ఒక అమ్మపాట ఉందని అనిల్ రావిపూడి అన్నారు. అనిల్ రావిపూడి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ తో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కడం గమనార్హం.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus