Mega 157: చిరు ప్రాజెక్టు.. టైటిల్ విషయంలో అనిల్ క్రేజీ స్ట్రాటజీ!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  నటిస్తున్న 157వ (Mega 157) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కి సంబంధించి వరుస వీడియో అప్డేట్లు ఫ్యాన్స్‌ని ఫుల్ ఎగ్జయిట్ చేస్తున్నాయి. ప్రతి ప్రమోషనల్ క్లిప్‌లో చివర్లో వాడుతున్న “రఫ్ఫాడించేద్దాం” డైలాగ్ ఇప్పుడు టైటిల్‌ను ఊహించుకునే దిశగా ప్రేక్షకుల దృష్టిని మళ్లించింది. ఇప్పటికే ఈ డైరెక్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)   అనే డైలాగ్‌ని నిజమైన టైటిల్‌గా మార్చిన ట్రాక్ రికార్డ్ లో ఉన్నాడు.

Mega 157:

ఇప్పటివరకు విడుదలైన వీడియోలన్నింటిలోనూ ‘రఫ్ఫాడించేద్దాం’ డైలాగ్‌ను రిపీట్ చేయడం ద్వారా ఇది టైటిల్‌కు హింట్ అనే గుసగుసలుగా మారుతోంది. చిరు సినిమాల దగ్గర ఒక క్యాచ్ ఫ్రేజ్‌ని టైటిల్‌గా మార్చే ట్రెండ్ గతంలోనూ కనబడింది. ఇప్పుడు అదే స్టైలును అనిల్ రావిపూడి మరోసారి ఫాలో అవుతున్నారని బోలెడంత బజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం చిరంజీవి ఫ్యాన్స్‌కి కాకుండా, క్లాసిక్ ‘గ్యాంగ్ లీడర్’ మూవీ లవర్స్‌కి కూడా ఓ నోస్టాల్జియా ట్రిగ్గర్ కావొచ్చు.

 

‘రఫ్ఫాడించేద్దాం’ అనేది చిరు ఎనర్జీకి తగ్గట్టుగా, సినిమాకు సరిపోయేలా ఉండే టైటిల్ అని అభిమానులు భావిస్తున్నారు. పైగా నయనతార  (Nayanthara) లేడీ లీడ్‌గా నటిస్తుండటంతో, ఇది క్లీన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా కూడా అందరిని ఆకట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎనర్జీ, ఎమోషన్, కామెడీ, మాస్.. అన్నట్టుగా అనిల్ ఈ స్క్రిప్ట్‌ను డిజైన్ చేశాడట. విజువల్‌గా కూడా ఇది చిరు సినిమాల్లో కొత్త మైలు రాయి అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతి బరిలో మెగాస్టార్ దిగుతున్నాడన్న వార్తలు వస్తున్న వేళ, టైటిల్‌పై స్పష్టత రావడం ఫ్యాన్స్‌కి మరో బూస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి నిజంగా టైటిల్‌గా (Mega 157) ‘రఫ్ఫాడించేద్దాం’ ఫిక్స్ చేస్తారా లేదా ఇదో పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus