మరింత గ్లామరస్ గా ‘ఎఫ్ 3’.. వర్కవుట్ అవుతుందా..?

టాలీవుడ్ లో ప్రీక్వెల్స్, సీక్వెల్స్ ని పెద్దగా ఆడిన హిస్టరీ లేదు. భారీ హిట్టు సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన సినిమాలు డిజాస్టర్లు గా మిగిలాయి. అయితే దర్శకుడు అనీల్ రావిపూడి మాత్రం తన ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ని తెరకెక్కించబోతున్నాడు. ‘ఎఫ్ 2’ రిలీజైన సమయంలోనే సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. చెప్పినట్లే ‘ఎఫ్ 3’ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే వారంలో ‘ఎఫ్ 3’ సినిమా మొదలుకానుంది. ఇందులో వరుణ్ తేజ్, వెంకటేష్ లతో పాటు మరో హీరో కూడా ఉంటాడని టాక్.

తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా కంటిన్యూ అవ్వనున్నారు. అయితే వీరిద్దరూ కాకుండా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో వెంకీ పక్కన ఇద్దరు భామలు, వరుణ్ పక్కన ఇద్దరు భామలు నటిస్తారట. దాంతో పాటు ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఆ పాటలో కూడా ఓ హీరోయిన్ కనిపించనుందని టాక్. అంటే మొత్తంగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

‘ఎఫ్ 2’ సినిమాకి తమన్నా, మెహ్రీన్ ల గ్లామర్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకే సీక్వెల్ లో కామెడీ డోస్ తో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచేయాలని ప్లాన్ చేశాడు దర్శకుడు అనీల్. అందుకే మొత్తం ఐదుగురు హీరోయిన్లను రంగంలోకి దింపుతున్నాడు. దీని ద్వారా మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి అనీల్ ప్లాన్ వర్కవుట్ అయి ఈ సీక్వెల్ తో హిట్ అందుకుంటాడేమో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus