సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. కొన్నాళ్ల నుండి.. ప్రతీరోజూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి మరణించారు. అదే సమయంలో స్టార్ నటుడు నాజర్ తండ్రి కూడా వయసు సంబంధిత సమస్యలతో మరణించారు. అటు తర్వాత మలయాళ నటుడు కుందర జానీ, విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు,బాలీవుడ్ నటి భైరవి, ‘సింగం’ దర్శకుడైన హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్, శృంగార నటి బాబిలోనా సోదరుడు విక్కీ,హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన కమెడియన్ మాథ్యూ పెర్రీ,నటి డా.ప్రియ వంటి వారు కన్నుమూశారు.
ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… తమిళ దర్శకుడు అర్పుదాన్ కన్నుమూశారు. ఆయన వయసు 52 ఏళ్ళు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు తెలుస్తుంది.ఈయన మరణ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. గతంలో అర్పుదాన్ ఉదయ్ కిరణ్ తో ‘లవ్ టుడే’ అనే సినిమా చేశారు. ఇది పెద్దగా ఆడలేదు.
ఆ తర్వాత లారెన్స్ తో ‘అద్భుతం’ అనే సినిమా తీశారు. అది తెలుగులో కూడా డబ్ అయ్యింది. కానీ ఇక్కడ ఆడలేదు. అయితే తమిళంలో ఈ సినిమా బాగా ఆడింది. లారెన్స్ నటుడిగా నిలబడటానికి కారణం ఇదే అని చెప్పాలి. అర్పుదాన్ (Director Arputhan) తమిళ సినిమాల్లో సేడ్ క్యారెక్టర్స్ చేయడం కూడా జరిగింది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!