తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్ అట్లీ.. వైరల్ అవుతున్న పోస్ట్..!

  • December 16, 2022 / 06:44 PM IST

సౌత్ సెలబ్రిటీలు వరుసగా శుభవార్తలు చెప్తూ సందడి చేస్తున్నారు.. ఇటీవలే నాగ శౌర్య, హన్సిక ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకున్నారు.. కన్నడ స్టార్స్ హరిప్రియ, వశిష్ట ఎన్. సింహా, సీనియర్ నటి సుమలత, దివంగత అంబరీష్ దంపతుల కుమారుడు, నటుడు అభిషేక్ అంబరీష్ నిశ్చితార్థాలు జరిగాయి..ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నామని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.. ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట కూడా మా ఫ్యామిలీ పెద్దదవుతోందంటూ ప్రకటించారు..

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంటుగా పని చేసి.. ‘రాజా రాణి’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ ఫిలింతోనే బెస్ట్ అనిపించుకున్నాడు.. దళపతి విజయ్‌తో ‘తేరి’ (పోలీసోడు), ‘మెర్సల్’ (అదరింది), ‘బిగిల్’ (విజిల్) సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు.. ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా ఫారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ చేస్తున్నాడు.. అట్లీ కుమార్, కృష్ణ ప్రియను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..

ఈ కపుల్ కలర్ గురించి ఎన్ని మీమ్స్ వచ్చాయో, అలాగే ప్రేమకు రంగు అడ్డుకాదని, అసలైన ప్రేమకు అర్థం చెప్పారంటూ ఎన్ని వార్తలొచ్చాయో తెలిసిందే.. ఇప్పుడు అట్లీ భార్య గర్భవతి.. తమ కుటుంబం పెద్దది కాబోతుందని.. భార్యని మాత్రమే కాకుండా.. మేం ప్రెగ్నెంట్స్ అని.. ఈ విషయం షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది.. మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ అట్లీ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఆకట్టుకుంటుంది.. సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు అట్లీ – ప్రియ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

 

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus